ఈ భూమ్మీద దేన్నైనా మనం చీప్ గా తీసివేయరాదు.. ఏదైనా ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఉపయోగ పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ప్రస్తుత కాలంలో యువత టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్తున్నారు. పనికిరాని వస్తువులను కూడా ఏదో ఒక విధంగా పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు.. అలా వారి ప్రతిభకు సానబెట్టి ప్రయోగాలు చేస్తూ జీవితాన్నే మార్చేసుకుంటున్నారు. అలాంటిదే చేశారు ఈ దంపతులు.. వివరాలు ఏంటో చూద్దాం.. జైపూర్ కు చెందిన ముదిత రాదేష్ భార్యాభర్తలు కోడి ఈకలతో వినూత్న ప్రయోగం చేశారు. ఈకలతో దుస్తులు తయారు చేసి కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మొదట్లో వీరి ఐడియాను చాలామంది హేళన చేశారు.
Advertisement
Advertisement
అవేవీ పట్టించుకోకుండా వారి ప్రయోగాన్ని వారు చేస్తూనే వెళ్లారు. దీంతో వారి ఐడియా సక్సెస్ అయి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకరోజు రాధే శ్ ఒక ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఒక చికెన్ సెంటర్ లో నిలబడి ఉండగా కోడి ఈకలను చేతితో తాకాడు. అనుకోకుండానే ఆయనకు ఒక ఆలోచన మెదిలింది.. తనకు వచ్చిన ఆలోచన గురించి తన భార్యతో చెప్పి ఇద్దరూ కలిసి ఆ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం కోసం చాలా సంవత్సరాలు పట్టింది. మధ్యలో పరిస్థితులు కూడా అనుకూలించలేదు. కానీ వారు పట్టుదలతో ముందుకు వెళ్లి కోడి ఈకలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మార్కెట్లో చాలా మందిని ఆకర్షించాయి. దీంతో ఉత్పత్తులు పెరిగాయి. విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. దీంతో వారి ఆలోచన సక్సెస్ అయింది.
ప్రస్తుతం ఈ దంపతులు కోట్లాది రూపాయల టర్నోవర్ ని సొంతం చేసుకున్నారు.. అయితే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందట. వీటితో దుస్తులు తయారు చేసే విధానం ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు.గూగుల్లో సెర్చ్ చేసినా కానీ దొరకదు. కానీ వీరు కష్టపడి ఎలాగోలా ఈకలతో దుస్తులు తయారు చేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో వారి పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.. ప్రస్తుతం వారి వార్షిక ఆదాయం రెండు కోట్లకు పైగానే ఉంది.. ఈ విషయం కాస్త బయటకు రావడంతో రాధే శ్యామ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Astrology: తినే ఆహారంలో వెంట్రుకలు వస్తున్నాయా..అయితే మీ జాతకంలో అది ఉన్నట్టే..?