Home » క్లీన్ షేవ్ చేసుకుంటే ప్రాణాంత‌క వ్యాధి వ‌స్తుందట‌..! అది నిజ‌మా..?

క్లీన్ షేవ్ చేసుకుంటే ప్రాణాంత‌క వ్యాధి వ‌స్తుందట‌..! అది నిజ‌మా..?

by Sravan Sunku
Ad

ఈ మ‌ధ్య కాలంలో అబ్బాయిలు క్లీన్ షేవ్ కంటే ట్రిమ్మింగ్‌కే ఎక్క‌వగా ఆస‌క్తి చూపుతున్నారు. గ‌తంలో ఎవ‌రైనా క్లీన్ షేవ్ చేసుకునే వారు. ముఖ్యంగా ర‌ఫ్ లుక్ తో ఉండే అబ్బాయిల‌ను ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకే ఎక్కువ మంది అబ్బాయిలు క్లీన్ షేవ్‌ను ఎప్పుడో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ఇప్పుడు ఎక్క‌డ చూసినా ట్రిమ్మింగ్ చేసుకున్న అబ్బాయిలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

ఇది ఒకందుకు చాలా మంచిద‌ని.. ట్రిమ్మింగ్ చేసుకుంటున్న అబ్బాయిలు ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డ్డ‌ట్టే అంటూ యూనివ‌ర్సిటీ ఆఫ్ స‌ద‌ర‌న్ క్వీన్‌లాండ్ వారు పేర్కొంటున్నారు. ఈ ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీ క్యాన్స‌ర్ కార‌కాలు, ప్రాణాంత‌క వ్యాధుల గురించి ప్ర‌యోగాలు చేస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా గ‌డ్డం రెగ్యుల‌ర్‌గా క్లీన్ షేవ్ చేసే వారికి క్యాన్స‌ర్ ఎక్కువ శాతం వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ వారు చేప‌ట్టిన ప్ర‌యోగంలో నిర్ధారించారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా సూర్యుడి నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల తాకిడి త‌క్కువ‌గా ఉంటుంద‌ని, తద్వారా ప్ర‌మాదాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ప్ర‌యోగంలో దాదాపు 10వేల మంది పురుషుల‌ను ఆ యూనివ‌ర్సిటీ వారు ప‌రిశీలించారు. చ‌ర్మ క్యాన్స‌ర్ వ‌చ్చిన వారిలో ఎక్కువ శాతం రెగ్యుల‌ర్‌గా క్లీన్ షేవ్ చేసే వారు ఉన్నార‌ని, క్లీన్ షేవ్ చేయ‌డం వ‌ల్లే వారికి ఈ క్యాన్స‌ర్ వ‌చ్చి ఉంటుంద‌ని యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు గుర్తించారు.

ఈ విష‌యంపై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. కుర్రాళ్లు కొంద‌రూ క్లీన్ షేవ్ చేసుకునేవారు. ఇక‌పై ట్రిమ్మింగ్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటున్నారు. ఇక ప్రాంణాంత‌క వ్యాధి సోకే ప్ర‌మాదం ఉన్న‌ప్పుడు రిస్క్ తీసుకోవ‌డం ఎందుకు చెప్పండి..? ఇంకా మీరు క్లీన్ సేవ్ చేసుకుంటే మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఇక మీరు ట్రిమ్మింగ్‌కు మారిపోండి..!

Visitors Are Also Reading