ఇటీవల మంచు మనోజ్ మరియు మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. దీంతో వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలలో వారిద్దరితో పాటు మంచు కుటుంబం అందరూ ఉన్నారు. ఒక మంచు విష్ణు తప్ప. ఆ ఫోటోలలో మంచు కుటుంబం అంతా కనిపించింది. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహానికి మంచు విష్ణు వచ్చాడు.
READ ALSO : పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!
Advertisement
కానీ మిగిలిన కార్యక్రమాలు అన్నిటిలో కూడా ఎక్కడా కనిపించలేదు విష్ణు. మంచు విష్ణు అలా దూరంగా ఎందుకు ఉన్నాడు అన్న విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక తాజాగా మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్ గా పెట్టాడు మనోజ్. మనోజ్ ఫేస్బుక్ స్టోరీ పోస్టుతో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వారి మధ్య విభేదాలను బయటపెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తన వాళ్ళను, బంధువులను కొడుతూ ఉంటాడు అంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు.
Advertisement
READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి
తన మనిషి సారధిని కొట్టాడు అంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి. ఈ మధ్య మంచు మనోజ్ కు ఆయన మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాడు మనోజ్. విష్ణు తరచు ఇలా చేస్తున్నాడంటూ మనోజ్ కామెంట్ చేశారు. మేము ఏమైనా ఊరికే వచ్చామా, తీసు కున్నామా అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.