Home » మీకు తెలియ‌ని CINTHOL స‌బ్బు స్టోరీ! జ‌ర్మ‌నీ యుద్దంతో లింక్!

మీకు తెలియ‌ని CINTHOL స‌బ్బు స్టోరీ! జ‌ర్మ‌నీ యుద్దంతో లింక్!

by Azhar
Ad

మ‌న ఇండ్ల‌లో వాడే సింథాల్ స‌బ్బుకు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఆ చ‌రిత్ర 1939 జ‌ర్మ‌నీ యుద్దంతో ముడిప‌డి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం! గోద్రెజ్ గ్రూప్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడైన ఫిరోజ్ షా గోద్రెజ్ కొడుకు బుర్జోర్ గోద్రెజ్ ఉన్న‌త విద్య‌కోసం జ‌ర్మ‌నీ యూనివ‌ర్సిటీకి వెళ్లాడు.

Advertisement

స‌బ్బుల త‌యారీ మీద ఇంట్ర‌స్ట్ తో దాన్నే త‌న పిహెచ్ డి అంశంగా ఎంచుకున్నాడు. ఆ ప‌ని కొన‌సాగుతున్న క్ర‌మంలో 1939లో జ‌ర్మ‌నీలో యుద్దం ప్రారంభ‌మైంది. యుద్ద‌భ‌యంతో త‌న ప‌రిశోధ‌న‌ను మ‌ధ్య‌లోనే ఆపేసి బుర్జోర్ ఇండియాకు వ‌చ్చేశాడు. తండ్రి స‌లహామేర‌కు ఇక్క‌డి గోద్రెజ్ కంపెనీలో త‌న ప‌రిశోధ‌న‌ను కొన‌సాగించాడు.

Advertisement

మురికిని వదిలించ‌డంతో పాటు సువాస‌న‌ను వెద‌జ‌ల్లే స‌బ్బును త‌యారుచేయాల‌నే ఉద్దేశంతో బుర్జోర్ వివిధ ర‌సాయ‌నాల క‌లుపుతూ ప్ర‌యోగాలు చేస్తున్న క్ర‌మంలో… ఫినాల్ అనే యాంటీ బ్యాక్టీరియ‌ల్ ఏజెంట్ ల‌క్ష‌ణాలు క‌లిగిన డీడోరైజింగ్ ఏజెంట్ ను క‌నుగొన్నాడు. ఫినాల్ ఆధారిత స‌మ్మేళ‌నాల‌నుప‌యోగించి స‌బ్బును త‌యారుచేసే టెక్నాల‌జీపై పేటెంట్ ను సాధించిన బుర్జోర్ క‌నుగొన్న బుర్జోర్ … సబ్బుల ఉత్ప‌త్తి కోసం గోద్రెజ్‌లో కొత్త విభాగాన్ని ప్రారంభించాడు. సింథటిక్ ఫినాల్ ను ఉప‌యోగించిన ఉత్ప‌త్తి చేయ‌బ‌డ్డ స‌బ్బు కాబ‌ట్టి. సింథ‌టిక్ లోని సింథ్ ను ఫినాల్ లోని ఆల్ ను క‌లిపి సింథాల్ అనే పేరును ఖ‌రారు చేశారు. ఆగస్ట్ 15, 1952న ప్రారంభించబడిన సింథాల్ సోప్ ఆ త‌ర్వాత స‌బ్బుల ప్ర‌పంచంలో చాలా కాలం రారాజుగా వెలుగొందింది.

Also Read: దేవుడి కాన్సెప్ట్ తో వ‌చ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన 5 సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading