మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి పొలిటికల్ రీయంట్రి గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి మళ్ళీ పొలిటిక్స్ లోకి వస్తారని ఆయన ఒక మంచి పదవి చేపడతారని అంతా అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం అనేది తెలియదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతా పేరు తెచ్చుకున్న చిరంజీవి సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఆయనలాగే దూసుకు వెళ్తున్నారు.
Advertisement
2008లో తిరుపతిలో జరిగిన సభలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తో తలపడడం మామూలు విషయం కాదు. చాలా రిస్క్ తో కూడుకున్నది. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పిఆర్పి అట్టర్ ప్లాప్ అయిపోయింది. 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయాన్ని సాధించిన చిరు తర్వాత పార్టీ నడపడం సులువు కాదని కాంగ్రెస్ తో విలీనం చేసేసారు తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
Advertisement
Also read:
Also read:
ఆ తర్వాత ఒక ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు అయితే రాజకీయ జీవితాన్ని ఆపేసిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని టాక్. ఒక మంచి ముఖ్యమైన పదవిని ఆయన తీసుకుంటారని అంతా అంటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చిరంజీవి సినిమాలుకు పుల్ స్టాప్ పెట్టరని అదే సమయంలో ఆయన ఊహించని పదవి మెగాస్టార్ ని వరిస్తుందని జోస్యం చెప్పారు మరి ఇది జరుగుతుందా లేదా చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!