రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై రాంగోపాల్ వర్మ స్పందించిన తీరు చాలా హాట్ టాపిక్ గా మారింది. మహోన్నత కళాకారుడికి మహోన్నత వీడ్కోలు అందించాలని కోరుకుంటూనే వరుసగా ట్వీట్స్ తో సంచలనం సృష్టించారు. రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ రెబల్ స్టార్ ఇక మనకు లేడు అంటూ తెలుగు ఇండస్ట్రీతో పాటుగా ఎంతోమంది అభిమానులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పలువురు సినీ నటుల తో పాటు, ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. అలాంటి దిగ్గజ నటుడు మరణం చెందారని తెలిసి సినీ లోకం కన్నీరు పెట్టుకుంటోంది.
Advertisement
ALSO READ:ముప్పై ఏళ్లకే ముడతలా.. ఫోన్‌తో ఎక్కువసేపు గడిపితే ఇక అంతే..!
Advertisement
కృష్ణంరాజు బౌతికఖాయానికి నివాళులు అర్పించడానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా కృష్ణం రాజు మరణంపై వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. మన చావు కి విలువ ఉండాలంటే కృష్ణం రాజు లాంటి వారికి విలువ ఇవ్వాలి, కనీసం రెండు రోజులైనా షూటింగ్ ఆపేద్దాం అంటూ ట్వీట్ పెట్టాడు. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుందని నెల రోజులు షూటింగ్ ఆపిన పరిశ్రమ మనది. గతంలో విషయాలు తెలియజేస్తూ ఈ విషయం చెప్పాడు.
కృష్ణ, మురళి మోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, వెంకటేష్ లకు ఈ విషయం మనవి చేస్తున్నాను అంటూ ఈ స్థితి అనేది ఎవరికైనా వచ్చేదే.. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మి వేసుకోవడం లాంటిదంటూ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య లాంటి మరెన్నో గొప్ప చిత్రాలు తీసిన మహానటుడు, నిర్మాత కొరకు ఒక రోజు షూటింగ్ ఆపి వేయని స్వార్థపూరిత తెలుగు ఇండస్ట్రీకి నా జోహార్లు అంటూ, షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ALSO READ:హీరో నాగార్జున తోబుట్టువులు ఎంతమంది ఉన్నారో..? ఏం చేస్తున్నారో తెలుసా..?