తెలుగు ఇండస్ట్రీలో అలనాటి దివంగత శ్రీదేవి ఒక ఊపు ఊపేది.. ఆమె అందానికి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె అందం అభినయం, నటనా, చతురతతో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు. ఏ సినిమా తీసిన శ్రీదేవి హీరోయిన్ అంటే ఇక సినిమాకు తిరుగు ఉండదు అనే పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా శ్రీదేవి మా సినిమాల్లో ఉండాలని దర్శక నిర్మాతలకు ఒత్తిడి తెచ్చి మరి ఆమెను ఎంపిక చేసేవారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ,చంద్రమోహన్, కృష్ణంరాజు ఇలా చాలా మందితో శ్రీదేవి నటించి సూపర్ హిట్లు కొట్టింది.
Advertisement
also read:20 ఏళ్ల వయసులోనే డేటింగ్.. చివరికి మోసపోయిన హీరోయిన్..!
వీరి తర్వాత తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పక్కన కూడా జత కట్టింది. ఇక ఎప్పుడైతే శ్రీదేవి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందో వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె అందచందాలకు బాలీవుడ్ సినీ లవర్స్ కూడా మతితప్పి పోయారట. బాలీవుడ్లోకి పోయిన తర్వాత దక్షిణాది సినిమాలపై అంతగా ఆసక్తి చూపించలేదు. ఒకవేళ నటించాలి అంటే బాగా పేరు తెచ్చుకున్న హీరో, లేదంటే తెలిసిన దర్శక,నిర్మాతలు అయితేనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని నటించేదట. అయితే శ్రీదేవి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలో మెగాస్టార్ తో ఒక సినిమా చేసే సందర్భంలో ఆమెకు ఈగో సమస్య వచ్చింది. ఈ సినిమా శ్రీదేవి సొంత సినిమా. తన తల్లిని నిర్మాతగా పెట్టి శ్రీలత మూవీస్ బ్యానర్ పై కోదండరామిరెడ్డి డైరెక్షన్లో సినిమా తీయాలని అనుకున్నారు. చిరంజీవి హీరో..
Advertisement
శ్రీదేవి తన సొంత బ్యానర్లో సినిమా చేయాలని అడగడంతో చిరు వెంటనే ఓకే చెప్పారు. యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. అంతకుముందే చిరు, శ్రీదేవి కాంబోలో రాణికాసుల రంగమ్మ, మోసగాడు అనే సినిమాలు కూడా వచ్చాయి.. అయితే వీరికి రచయిత యండమూరి 20 కథలు చెప్పారట. ఇందులో ఒక కథలో హీరో పాత్ర డామినేషన్ అని శ్రీదేవి అభ్యంతరం చెబితే.. మరో కథలో హీరోయిన్ పాత్ర డామినేషన్ అని చిరు అభ్యంతరం చెప్పేశారట.. చివరికి 20 కథలు విన్నాక చిరు శ్రీదేవి ఒక కథను ఫైనలైజ్ చేశారు. ఇందులో శ్రీదేవి నిర్మాత అవడంతో తన రోల్ ఎక్కువగా ఉండాలని పదేపదే డైరెక్టర్ కోదండరామిరెడ్డిపై ఒత్తిడి చేసిందట. ఈ సినిమాకు వజ్రాల దొంగ అని టైటిల్ కూడా పెట్టారు. ఓ పాట షూట్ అయిపోయింది. కానీ వీరు ఈగోల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగింది. ఇక దీని తర్వాత శ్రీదేవి చిరంజీవి కలిసి నటించలేరు అని అందరూ అనుకున్నారు. కానీ వైజయంతి అధినేత అశ్వినీదత్ వీరిని ఒప్పించి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తీసి ఇండస్ట్రీలోనే బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టారు.
also read:నాగార్జునతో నటించడానికి శ్రీదేవి అప్పట్లో భయపడిందా ?