మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాసరి తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా అభివర్ణిస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ముందుంటారు చిరంజీవి. చాలా మంది చిరంజీవికి ఎంత ఉందో.. అతని ఆస్తి విలువను మనం మనకు నచ్చిన విధంగా ఓ అంచనా వేస్తుంటాం. ఇక కొందరు అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చెన్నైలోని ఎన్నో విలువైన భూములను, ఆస్తులను అమ్మేశారని కూడా పేర్కొంటున్నారు. చిరంజీవికి హైదరాబాద్‌లో ఖరీదైన భూములు ఉన్నాయి. చిరు తన సంపాదనలో చాలా వరకు భూమి మీదే పెట్టారని అంటుంటారు. ఇప్పుడు చిరంజీవి తన ప్రాపర్టీని అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: స్మార్ట్ ఫోన్ సాయంతో సీక్రెట్ కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసా..?
Advertisement
ఇక చిరంజీవికి ఫిల్మ్‌నగర్‌లో మూడువేల స్క్వేవ్ యార్డుల స్థలం ఉందట. దానిని 1990వ దశకంలో దాదాపు 30 లక్షలకు కొన్నారట. చిరంజీవి ఆ స్థలాన్ని ఇప్పుడు అమ్ముతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి స్థాయికి ఇప్పుడు వీటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమి రాలేదు. కానీ అమ్మేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆచార్య సినిమాకి వచ్చిన నష్టాన్ని పూడ్చడానికే చిరంజీవి అమ్ముతున్నట్టు ఓ వార్త వినిపించడం గమనార్హం. ప్రస్తుతం ఆ స్థలం ఒక్క స్క్వేర్ యార్డ్ విలువ దాదాపు రెండు లక్షలుంటే.. డీల్ మాత్రం రూ.2.35 లక్షల వరకు జరిగిందని తెలుస్తోంది.
Advertisement
ఇవి కూడా చదవండి: మీ శరీరం, నోటి నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే మటుమాయం..!
మొత్తానికి ఈ ల్యాండ్ డీల్ రూ.70కోట్ల వరకు జరిగిందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి మాత్రం ఇష్టంలేకుండానే ఈ ప్రాపర్టీని అమ్ముతున్నట్టు సమాచారం. అవతలి పార్టీ చాలా ఒత్తిడి చేస్తుండడంతో ఇలా అమ్మేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి నుంచి ఓ ప్రముఖ దినపత్రిక యజమాని ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించడం గమనార్హం. ఇక ఏది ఏమైనా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూస్తుంటే మాత్రం చిరంజీవి ప్రాపర్టీ అమ్మడం ఖాయమనే తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి.