Home » శుభ‌గృహ‌ యాడ్ కోసం చిరంజీవి క‌ళ్లు చెదిరే రెమ్యూన‌రేష‌న్..ఎంతంటే..!!

శుభ‌గృహ‌ యాడ్ కోసం చిరంజీవి క‌ళ్లు చెదిరే రెమ్యూన‌రేష‌న్..ఎంతంటే..!!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యామిలీ నుండే ఎక్కువమంది వారసులు వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్నారు అంటే అది చిరంజీవి క‌ష్ట‌మేన‌ని చెప్పాలి. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత తనకు రాజకీయాలు సూట్ కావ‌ని మళ్లీ వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక రీఎంట్రీ ఇచ్చిన‌ తర్వాత మెగా స్టార్ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా తో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్ల‌ తో పాటు సీనియర్ డైరెక్టర్ల‌తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉండగానే చిరంజీవి ప్రస్తుతం లూసీఫ‌ర్ రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం తో పాటు మరికొన్ని చిరు న‌టిస్తున్న మ‌రికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే తాజాగా సుకుమార్ తో చిరంజీవి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి సుకుమార్ దర్శకత్వంలో శుభ గృహ యాడ్ లో నటించారు.

ALSO READ : RAHUL SIPLINGUJ : హైద‌ర‌బాద్ ప‌బ్ లో సోదాలు…ప్ర‌ముఖ‌ సింగ‌ర్ రాహుల్ సిప్లింగ‌జ్ అరెస్ట్…!

ఈ యాడ్ లో కుష్బూ, అన‌సూయ‌ తో కలిసి చిరంజీవి నటించారు. శుభ‌గృహ‌ రియల్ ఎస్టేట్ యాడ్ లో చిరంజీవి న‌టించగా ఈ యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సాధారణంగా తన సినిమాలకు 14 నుండి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. కానీ ఈ యాడ్ కోసం ఏకంగా చిరు సగం రెమ్యూనరేషన్ తీసుకున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading