1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మించారు. 1990 మే 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Advertisement
Advertisement
ఈ సినిమాలో నటించింనందుకు గాను చిరంజీవికి 35 లక్షల పారితోషికం ఇచ్చారట, ఇక చిరుకు జంటగా నటించింన శ్రీదేవికి 25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ సినిమాకు పెట్టిన ఖర్చులన్నీ పోనూ నిర్మాతకు 35 లక్షలు మిగిలాయట! ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో 15 లక్షలు మిగిలితేనే సినిమా సూపర్ హిట్., ఆ లెక్కన చూస్తే జగదేకవీరుడు అతిలోక సుందరి బంపర్ హిట్ అన్నట్టే!
అప్పట్లో బాల్కనీ టికెట్ ధర 6 రూపాయలు మాత్రమే! అయినప్పటికీ ఈ సినిమా 7 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా నిర్మాణానికి 9 కోట్లు దాకా పెట్టాడట అశ్వనీదత్… సినిమా మీద నమ్మకంతో తన దగ్గర ఉన్న డబ్బునంతా పెట్టేశాడట!