చాలా మంది స్టార్ హీరోల తనయులు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ ఎంట్రీ ఇచ్చిన ప్రతిఒక్కరూ సక్సెస్ అవ్వలేరు. కానీ టాలెంట్ తో పాటూ అదృష్టం కూడా ఉంటే పక్కా స్టార్ అవుతారు. ఇక టాలీవుడ్ లోనూ చాలా మంది హీరోల తనయులు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కుమారుడు రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా తరవాత చరణ్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చరణ్ కు అభిమానులు పెరిగిపోయారు. అంతే కాకుండా రామ్ చరణ్ రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ఇక ఆ తరవాత తిరిగి వెనక్కి చూసుకోలేదు.
Advertisement
వరుస సినిమాలతో చరణ్ ఫుల్ బిజీ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు మందు రామ్ చరణ్ నటనపై విమర్శలు వచ్చేసి కానీ ఈ సినిమాతోనే నటనతోనూ మెప్పించాడు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో మరో సక్సెస్ ను అందుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే నిజానికి చిరంజీవి మొదట రామ్ చరణ్ ను సినిమాల్లోకి తీసుకురావడం ఇష్టం లేదట.
సినిమాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని….పైకి ఎదుగుతుంటే తొక్కేసేవాళ్లు కూడా చాలా మంది ఉంటారని అనుకున్నారట. అంతే కాకుండా చరణ్ ను డాక్టర్ చేయాలని చిరు అనుకునేవారట. అయితే చరణ్ చదువులో యావరేజ్ స్టూడెంట్ అవ్వడం…హీరో అవుతానని చెప్పడంతో కొడుకు కోరికమేరకు ఒప్పుకున్నారట. ఇక చరణ్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.