టాలీవుడ్ కు గుర్తింపు తెచ్చిపెట్టిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. తన నటనతో డ్యాన్స్ తో చిరు వరుస ఆఫర్ లు అందుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు.
Advertisement
ఇక మెగాస్టార్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాలలో స్టేట్ రౌడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాధ, భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి సినిమాకు స్వరాలు సమకూర్చారు. మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.
Advertisement
అయితే ఈ సినిమాకు ముందే సూపర్ హిట్ టాక్ రాలేదు. మొదట ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు భారీగానే వచ్చాయి. మెల్లి మెల్లిగా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అదే సమయంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ హీరోగా ఓ సినిమా విడుదలైంది.
కానీ ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ మెగాస్టార్ సినిమాకే వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్ అమితాబ్ సినిమా ను మించడంతో ప్రముఖ మ్యాగజైన్ వెర్ ఈజ్ అమితాబ్ అంటూ మెగాస్టార్ ఫోటోతో ఓ ఆర్టికల్ ను రాసింది. ఆ ఆర్టికల్ చదివిన తరవాత బాలీవుడ్ దిగ్గజాలు సైతం కంగుతిన్నారు. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ కు కమల్ హాసన్, రజినికాంత్ లు హాజరై చిరును అభినందించారు.