Home » ఇంట్లో అంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లిగారికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…! ఆ హీరో ఎవరంటే…?

ఇంట్లో అంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లిగారికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…! ఆ హీరో ఎవరంటే…?

by AJAY
Ad

టాలీవుడ్ లోని స్టార్ ఫ్యామిలీ లల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అంత మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవే కారణం. అయితే మెగా ఫ్యామిలీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు ఉన్నా కూడా చిరు తల్లి అంజానా దేవికి మాత్రం ఫేవరెట్ హీరో మరొకరు ఉన్నారు.

Advertisement

ఆయన మరెవరో కాదు ఇండస్ట్రీ లో ఒక్కప్పుడు స్టార్ హీరోగా ….అమ్మాయిల కలల రాకుమారుడు గా రాణించిన అక్కినేని నాగేశ్వరరావు. ఒకప్పుడు అక్కినేని ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే నటించేవారు. దాంతో ఆయన కు లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉండేవారు. ఇక అంజనా దేవి కి కూడా ఊహ తెలిసిన నాటి నుండి అక్కినేని అంటే చాలా ఇష్టమట.

Advertisement

ఆమె అక్కినేనికి వీరాభిమాని అంట. మరోవైపు చిరంజీవి అన్నగారు ఎన్టీఆర్ కు వీరాభిమాని….ఆయనను ఆదర్శంగా తీసుకునే చిరంజీవి సినిమాల్లోకి వచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన చిరు తక్కవ కాలం లో తన టాలెంట్ ను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగారు.

అక్కడితో ఆగకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పవన్ కూడా స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు.

Visitors Are Also Reading