Home » మరోసారి దయాగుణం చాటుకున్న చిరంజీవి… ఆ నటుడుకి ఏకంగా అన్ని లక్షల సాయం..!

మరోసారి దయాగుణం చాటుకున్న చిరంజీవి… ఆ నటుడుకి ఏకంగా అన్ని లక్షల సాయం..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఆన్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో పేదలకు సహాయం చేస్తూ ఉంటాడో… ఆఫ్ స్క్రీన్ పై కూడా అదే రేంజ్ లో పేదలకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎంతోమందికి చిరంజీవి సహాయం చేశాడు. అయినప్పటికీ చిరంజీవి తాను చేసిన సహాయాన్ని బహిరంగంగా చెప్పుకోరు. అది ఇతరుల ద్వారానే దాదాపుగా బయటికి వస్తూ ఉంటుంది.

Advertisement

అందులో భాగంగా తాజాగా కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు… తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విలన్ పాత్రల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న ఓ నటుడికి కూడా చిరంజీవి భారీ మొత్తంలో సహాయం చేసి తన దయా గుణాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ నటుడు ఎవరు..? చిరంజీవి అతనికి ఏ సాయం చేశాడో తెలుసుకుందాం.

Advertisement

తెలుగు… తమిళ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లోనూ… మరికొన్ని ముఖ్యపాత్రలలోను నటించి ప్రేక్షకులను అలరించిన నటుల్లో పొన్నంబలం ఒకరు. ఈ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా పొన్నంబలం మాట్లాడుతూ … నేను కొంతకాలం పాటు కిడ్నీ సమస్యలతో బాధపడ్డాను. అలా నేను కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో వారు నాకు డయాలసిస్ ను చేయించారు. ఆ సమయంలో నేను చికిత్సకు డబ్బు లేక చాలా ఇబ్బందులను పడ్డాను.

 

అలా బాధపడుతున్న సమయంలో ఒక రోజు మా అల్లుడు నన్ను ఆంజనేయస్వామి గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పూజ అనంతరం పూజారి చిరంజీవ చిరంజీవ అన్నారని ఆ సమయంలో తనకు చిరంజీవి పేరు గుర్తుకు వచ్చాడు అని తెలిపారు. చిరంజీవి ని అడుగుతే రెండు … మూడు లక్షల వరకు సహాయం చేస్తాడు అని భావించాను. దానితో నా స్నేహితుడి ద్వారా చిరంజీవి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. రెండు లక్షలు ఇస్తాడు అనుకున్న చిరంజీవి ఏకంగా 40 లక్షల సహాయాన్ని చేశాడు అని చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading