Home » చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!

చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి జనరేషన్ కు దీని కంటే కాస్త ముందు జనరేషన్ కూడా చిరంజీవి గారి ఫేవరెట్ హీరోగా ఉన్నారు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. మరి చిరంజీవి ఇంతటి స్థాయికి చేరడానికి మామూలు కష్టం పడలేదు. ఎంతటి కష్టం వచ్చినా తను నమ్ముకున్న సినిమా ఫీల్డ్ ని వదలకుండా, లక్ష్యమే చేరువగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. జనరేషన్ మార్పులకు తగ్గట్టుగా తాను మారుతూ ఏ తరం అభిమానులకైనా నచ్చే విధంగా చిరు స్టైల్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

READ ALSO : Citadel : ‘సిటాడేల్’ విడుదల ఖరారు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

ఇది ఇలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంటే అప్పట్లో ఒక మాస్ ఇమేజ్ ఉండేది. అలాంటి టైం లో ఆయనతో రుద్రవీణ అనే సినిమా తీశారు. ఈ సినిమా స్టోరీ బాగుంటుంది. అయినా కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం చిరంజీవి చాలా క్లాస్ గా కనిపిస్తాడు. అప్పటిదాకా చిరంజీవిని మాస్ గా చూసిన జనాలు అంత క్లాస్ గా చూడలేకపోయారు. చిరంజీవి అంటేనే ఫైట్స్ తో సినిమా ఉండాలి. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. దాంతో ఈ సినిమా అంటేనే చాలామందికి పెద్దగా నచ్చలేదు.

Advertisement

READ ALSO : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

ఇక ఈ సినిమా తర్వాత కే.విశ్వనాథ్ డైరెక్షన్ లో ఆపద్బాంధవుడు చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయినా కూడా ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ చాలా బాగుంటుంది. కే.విశ్వనాథ్ గారి డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో చిరంజీవి సాఫ్ట్ సినిమాలు చేయకుండా మళ్లీ మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ చిరంజీవి మాస్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

READ ALSO : సూపర్ స్టార్ కృష్ణ.. మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో ఎందుకు ఉండేవాడు ?

Visitors Are Also Reading