కొన్ని సినిమా కథలు ఒక హీరోతో అనుకుంటే మరొక హీరోతో తెరకెక్కించాల్సి వస్తుంటుంది. కానీ ఒకసారి తమ వద్దకు వచ్చిన కథకు నో చెప్పి ఆ తరవాత అదే సినిమాను రీమేక్ చేయడం అనే ఇప్పటి వరకూ జరిగి ఉండదేమో..కానీ చిరు ఖైదీ నెం150 విషయంలో అదే జరింగింది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన కత్తి సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది.
Advertisement
Advertisement
ఇక ఈ సినిమాను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా కథ ముందుగా మెగాస్టార్ వద్దకే వచ్చిందట. కత్తి సినిమా దర్శకుడు మురుగదాస్ కథను చిరంజీవికి వినిపించారట. కానీ చిరు అప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట. దాంతో కథ భాగా నచ్చినప్పటికీ మెగాస్టార్ ఆ సినిమాకు నో చెప్పారు.
అయితే చిరు రాజకీయాల నుండి మళ్లీ బ్యాక్ స్టెప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరవాత తనకు ఎంతగానో నచ్చిన కత్తి సినిమానే రీమేక్ చేయాలని అనుకున్నారట. కానీ అప్పటికే సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. కొంత మంది సినిమాను చూసారు కూడా. అయినప్పటికీ చిరంజీవి తనకు కథ నచ్చడంతో ఖైధీ నెం 150 పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు అంటూ బాక్స్ ఆఫీస్ ను కుమ్మేశారు.