తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన సినిమా నుంచి మొదలు రాజకీయం వరకు చాలా డిఫరెంట్ థింకింగ్ తో ముందుకు వెళుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ లాగే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మూడు పెళ్లిళ్ల వ్యవహారం తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
Advertisement
వైసిపి నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై అనేకసార్లు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రీసెంట్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు. ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకులను పవన్ ఏకీ పారేశారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, మీరు ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టేఫినీలను మెయింటైన్ చేస్తున్నారని ఫైర్ అయ్యాడు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Advertisement
రాజకీయ నేతలు పవన్ మీద చేసే విమర్శలపై మీ స్పందన ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది, ఇందుకుగాను చిరంజీవి మాట్లాడుతూ, రాజకీయంలో విమర్శల గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు, ఇక పవన్ నాకు బిడ్డలాంటోడు, పొలిటికల్ గా ఈ విషయం తన వ్యక్తిగతమని, సాధారణంగా రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అని, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని తెలియజేశారు చిరంజీవి, దీంతో మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
READ ALSO : ఇదేందయ్య ఇదీ.. ఏటీఎంలో 500 కొడితే 2500 వస్తున్నాయ్..వీడియో వైరల్