టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్ లలో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురుస్తోంది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో ఆడి పాడటంతో వారి అభిమానులు ఎంతో కుషీ అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ సినిమాలోని దోస్తీ పాట నాటు నాటు సాంగ్ ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు బెస్ట్ డ్యాన్సర్ లుగా పేరుంది. దాంతో ఈ పాటకు ఇద్దరూ కలిసి ఎంతో స్టైలిష్ గా స్టెప్పులు వేశారు. అంతే కాకుండా ఒకేసారి కాలు కదుపుతూ ఆకట్టుకున్నారు. ఈ పాటకు థియేటర్లో క్లాప్స్, విజిల్స్ పడ్డాయి. ఎన్టీఆర్ చరణ్ అభిమానులు ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే ఇదే పాటకు ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ డ్యాన్స్ చేస్తుందని ఓ మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫోటోకు బాలకృష్ణ ముకాన్ని…రామ్ చరణ్ ఫోటోకు చిరంజీవి ముఖాన్ని అమర్చి మీమ్ ను తయారు చేశారు. టాలీవుడ్ లోని సీనియర్ హీరోలలో మెగాస్టార్, బాలకృష్ణలు బెస్ట్ డాన్సర్ లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటి కూడా ఇద్దరి డ్యాన్స్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు.
ALSO READ : RRR హీరోయిన్ ఒలివియా మోరిస్ బాయ్ ఫ్రెండ్ ఎవరు….? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి..?
చిరు రీఎంట్రీ తరవాత చేసిన ఖైదీ నం 150 సినిమాలో తన డ్యాన్స్ తో ఎంతో ఆకట్టుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కూడా ఆయన తన డ్యాన్స్ లో మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే నాటు నాటు పాటకు కూడా సెట్ అవుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ ఒకే స్టేజ్ పై కనిపిస్తే సినిమాలో కాకపోయినా స్టేజ్ పైన అయినా కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయాలని కోరుకుంటున్నారు.