గతం లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తరవాత పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం పార్టీలో కీలకం గా వ్యవహరించారు. అయితే చిరు గుడ్ బై చెప్పిన తర్వాత కొన్నేళ్ల పాటు పవన్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటించారు.
Advertisement
వరుస బ్లాక్ బస్టర్ లు అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ తరవాత జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి.
Advertisement
అయితే ఈ వార్తలపై చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. చిరు హీరోగా నటించిన గాడ్ ఫాదర్ దసరా కు విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో చిరంజీవికి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. పవన్ పార్టీలో మీరు చేరుతున్నారా…. పొలిటికల్ ఎజెండా ఏంటి అంటూ ప్రశ్నించాడు. రాజకీయాలకు నేను దూరంగా సైలెంట్ గా ఉండటం వల్ల మేలు జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఎందుకు అంటే తమ్ముడు ఒక వైపు నేను ఒక వైపు ఉండటం సరి కాదని అన్నారు. జనసెన కి స్ట్రాంగ్ గా నా మద్దతు ప్రకటించలేదు. అంతే కాకుండా భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేము.
పవన్ కళ్యాణ్ నా తమ్ముడు నిబద్ధత ఆశయాలు కలిగినావాడు. ఇంకా పొల్యుట్ అవ్వలేదు..కాబట్టి తాను అలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అంతే కాకుండా గాడ్ ఫాదర్ సినిమా సినిమాలో వైసీపీని ఉద్దేశ్చించి పవన్ ఓ డైలాగ్ చెప్పారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల పై కూడా చిరు క్లారిటీ ఇచ్చారు. తను ఏ పార్టీ నీ ఉద్దేశ్యించి ఆ కామెంట్స్ చేయలేదని చెప్పారు.