Chiranjeevi: టాలీవుడ్ లో సినిమా రాజకీయాలు కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది సీనీపెద్ద మోహన్ బాబు అనిచెబుతుంటే మరికొందరు మెగాస్టార్ అంటున్నారు. దానికి కారణం ఇద్దరి మధ్య మా ఎన్నికల నాటి నుండి సైలెంట్ వార్ నడటమే. అంతే కాకుండా మంచు విష్ణు ఓ వీడియోలో ఏకంగా తనను చిరంజీవి ఎన్నికల నుండి డ్రాప్ అవ్వాలని కోరినట్టు కూడా చెప్పారు.
Advertisement
అంతే కాకుండా మంచు ఫ్యామిలీకి నాగబాబుకు మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి మంచు లక్షి హోస్ట్ గా చేసిన ఓ షోకు అతిధిగా వెళ్లారు. ఆ సమయంలో మంచు లక్ష్మి రాపిడ్ ఫైర్ లో భాగంగా వరుస ప్రశ్నలు వేసింది. ఈ ఇద్దరిలో మీకు ఎవరు ఇష్టం అంటూ వరుస ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగానే మోహన్ బాబు నాగార్జున ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటూ ప్రశ్నించింది.
Advertisement
దానికి చిరు మోహన్ బాబు అంటూ సమాధానం ఇచ్చారు. ఆ తరవాత నవ్వుతూ ఆ పేరు చెప్పకపోతే ఈ ఎపిసోడ్ మొత్తం కట్ చేస్తావు కదమ్మా…అంటూ మంచు లక్ష్మితో కామెంట్స్ చేశాడు. దాంతో మనస్పూర్తిగా చెప్పాడా లేదంటే తప్పక చెప్పాడా అన్నది కూడా అర్థం కాలేదు. అంతే కాకుండా కోదండ రామిరెడ్డి..రాఘవేంద్రరావు ఇద్దరిలో ఎవరు మంచి డైరెక్టర్ అని అడగ్గా వెంటనే కోదండరామిరెడ్డి అని సమాధానం ఇచ్చాడు.
అందే విధంగా బెస్ట్ యాక్డర్ ఎవరు అంటూ చరణ్, అల్లు అర్జున్ పేర్లను అడగ్గా చాలా కష్టమైన ప్రశ్న అంటూ సమాధానం ఇచ్చారు. ఒకరేమో నిలకడగా చేస్తే మరొకరు గెంతుతూ చేస్తారని ఆన్సర్ ఇచ్చాడు. ఇక చక్రవర్తి…ఇళయరాజా లలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రశ్నించగా ఇళయరాజా అంటూ సమాధానం ఇచ్చారు. ఇలయరాజా పక్కన ఎవరి పేరు పెట్టినా తాను ఆయన పేరే చెబుతానన్నారు.
Also Read: టాలీవుడ్ లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ !
Also Read: బొమ్మరిల్లు సినిమాను మిస్ చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..!