మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. అయితే చిరంజీవి గ్యాప్ లేకుండా ఆరేళ్ల పాటూ వరుస హిట్ లు అందుకున్న సంధర్బం కూడా ఒకటి ఉంది. చిరంజీవికి 1987 నుండి 1992 వరకూ గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆరేళ్లలో ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్ లను అందుకున్నారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..పసివాడి ప్రాణం సినిమా కూడా ఈ ఆరేళ్లలో వచ్చిందే. ఈ సినిమాతో చిరు బ్రేక్ డ్యాన్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
Also Read: KGF విలన్‌తో పెళ్లిపీటలెక్కనున్న పిల్ల జమీందార్ హీరోయిన్.. !
సినిమాలో విజయశాంతి, సుమలత హీరోయిన్ గా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతే కాకుండా చిరు నటించిన యముడికి మొగుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రాగా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరావత అత్త అల్లుడు టీజింగ్ డ్రామాతో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా వచ్చింది.
Also Read: సానియా మిర్జాతో విడాకులు…? అసలు విషయం చెప్పిన షోయబ్ మాలిక్..!
ఈ సినిమాకు కోదండిరామిరెడ్డి దర్శకత్వం వహించారు. చిరు శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ములేపింది. అంతే కాకుండా చిరు కెరీర్ లో చెప్పుకోదగ్గ మరో సినిమా గ్యాంగ్ లీడర్…ఈ విజయ బాపినీడు దరర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమా ఆరు కోట్లు వసూలు చేసింది. ఆ తరవాత చిరంజీవ ఘరానా మొగుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా అప్పటి వరకూ ఏ సినిమా వసూళు చేయని కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలా ఆరు బ్లాక్ బస్టర్ లను వరుసగా అందుకున్న చిరును టాలీవుడ్ లో ఏ హీరో అందుకోలేకపోయాడు. అలాంటి హిట్లు పడ్డాయి కాబట్టే అప్పటికీ ఇప్పటికీ చిరు స్టార్ గానే కొనసాగుతున్నారు.
Also Read: బీఆర్ఎస్ లో ప్రకాష్ రాజ్ కు కీలకపదవి…కేసీఆర్ స్కెచ్ మామూలుగా లేదుగా..?