జబర్దస్త్ ఫేం చిచ్ఛా చార్లెస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఉంటున్న 25 మంది నైజీరియన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా అదుపులోకి తీసుకున్న వారిలో ఛిచ్చా చార్లెస్ కూడా ఉన్నారు. చిచ్చా వీసా గడువు ముగిసి రెండేళ్లు అవుతోంది. కానీ ఆయన ఇక్కడే ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
చాలా మంది సోమాలియా, కాంగో, నైజీరియా, ఆఫ్రికా, యుగాండా దేశాలకు చెందిన దేశస్తులు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. దాంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే కార్తెన్ సెర్చ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా చిచ్చా యుగాండా దేశానికి చెందిన వాడుగా తెలుస్తోంది. కాగా చిచ్చా చదువుకునేందుకు యుగాండా నుండి వరంగల్ కు వచ్చారు. అలా చదువుకుంటున్న క్రమంలో టిక్ టాక్ లో తెలుగు పాటలు పాడి అభిమానులను సంపాదించుకున్నారు. వచ్చీ రాని తెలుగులో పాటలు పాడి ఆకట్టుకున్న చిచ్చా మెల్లిగా జబర్దస్త్ లో సైతం అవకాశాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కూడా చిచ్చా కనిపిస్తూ ఉంటాడు. అలా బుల్లితెర సెలబ్రిటీలతో చార్లెస్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. శ్రీముఖి, ముక్కు అవినాష్, అష్షు రెడ్డి తదితరులతో చిచ్చా చార్లెస్ వీడియోలు కూడా చేస్తుంటారు. అతడి వీడియోలకు లక్షల్లో వ్యూవ్స్ వస్తుంటాయి.
Advertisement