Home » పుజారా @ది వరస్ట్ రికార్డ్..!

పుజారా @ది వరస్ట్ రికార్డ్..!

by Azhar
Ad

భారత టెస్ట్ జట్టులో కీలక ఆటగాళ్ల పేర్లలో చేతేశ్వర్ పుజారా పేరు ఇన్ని రోజులో ముందు వరుసలో కాదు మొదటి స్థానంలో వినిపించేది. క్రీజ్లోకి వచ్చాడు అంటే చాలు అక్కడే పాతుకుపోయేవాడు. రాహుల్ ద్రావిడ్ లాంటి ఆటగాడు ‘ది వాల్’ రిటైర్మెంట్ తర్వాత టీం ఇండియాకు ఎవరు దిక్కు అనుకుంటున్న సమయంలో వెలుగులోకి వచ్చాడు పుజారా. అచ్చం ద్రావిడ్ ఆట తీరుతో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ… టీం ఇండియా నయా వాల్ గా పూర్తింపు తెచ్చుకున్నాడు. 2018 లో భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత పుజారా వాల్ నుండి ఒక్కో ఇటుక అనేది పడిపోవడం స్టార్ట్ అయ్యింది. అయితే ముఖ్యంగా గత రెండేళ్లుగా పుజారా అంతర్జాతీయ టెస్ట్ క్రిసీజెస్ లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు.

Advertisement

అందుకే ఈ మధ్యే శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ కు పుజారాను సెలక్టర్లు ఎంపిక కూడా చేయలేదు. అందుకే ఇంగ్లాండ్ కు వచ్చి కౌంటీల్లో పాల్గొన్నాడు. ఇక్కడ తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. సెంచరీలు. డబల్ సెంచరీలు అలవోకగా కొట్టేసాడు. అందకే ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు మళ్ళీ పుజారాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఈసారి పుజారా మళ్ళీ నిలబడతాడు అని అనుకున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చిన పుజారా… 46 బంతుల్లో 13 పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నాడు.

Advertisement

ఇక ఇక్కడే ఓ చెత్త రికార్డ్ నెలకొల్పాడు పుజారా. అదేంటంటే… ఇప్పటి ఈ ఇన్నింగ్స్‌తో కలుపుకొని పూజారా ఇప్పటి వరకు 12 సార్లు అండర్సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఈ సిరీస్ లోని గత ఏడాది మూడు మ్యాచ్ లలో కూడా పుజారా ఆండర్సన్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరుకున్నాడు. పూజారా బలహీనతను ఆండర్సన్ సరిగ్గా కనిపెట్టి ఫలితం అనేది రాబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆండర్సన్ టెస్టుల్లో అత్యధిక సార్లు పెవిలియన్ కు పంపిన బ్యాటర్ల జాబితాలో పూజారా మొదటి స్థానంలో ఉండగా… పీటర్‌ పిడిల్‌, డేవిడ్‌ వార్నర్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి :

ఇండియా VS ఇంగ్లాండ్ టెస్ట్ : ఆటగాళ్ల తలపై కెమెరా..!

తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

Visitors Are Also Reading