Home » ఈ మూడు అలవాట్లను మానుకొని మీ చెడు కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టండి..!

ఈ మూడు అలవాట్లను మానుకొని మీ చెడు కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టండి..!

by Anji
Ad

సాధారణంగా బరువు పెరగడం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. చాలామందిలో అనారోగ్య సమస్యలకు గురి కావడానికి అధిక శరీర బరువే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెంచుకోవడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాదు.. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగడం వల్ల చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది మూడు చెడు అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Advertisement

  • శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఎక్కువగా కూర్చోవడం, విశ్రాంతి కారణంగా చాాలా మందిలో కొలెస్ట్రాల్  పేరుకుపోతోంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండాపలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
  • టెన్షన్ పెరగడం కారణంగా కూడా ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి కారణంగా చాలా మందిలో గుండెపోటు సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు కుటుంబ విబేధాలు, పాత శత్రుత్వాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. బరువు పెరుగుతున్న వారు ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా బెటర్. 

Also Read :   పెళ్లైన స్త్రీలు బరువు పెరగడానికి గల కారణాలు ఇవే..!

Bad cholesterol | చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోయిందా? ఇలా తగ్గించుకోండి..!

  • మద్యపానం సామాజిక దురాచారం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తుందనే విషయం అందరికీ తెలుసు. క్రమం తప్పకుండా తాగే అలవాటు ఉన్నవారిలో పొట్ట, నడుము చుట్టు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. విపరీతమైన శరీర బరువు కూడా పెరుగుతారు. ప్రతిరోజూ మద్యపానం సేవించడం చాలా ప్రమాదకరం అని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read :  పాలలో ఆ రెండింటిని కలుపుకొని తాగితే ఆ సమస్యలకు చెక్..!

Visitors Are Also Reading