ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చివరగా చార్మి పూరిజగన్నాత్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా సమయంలో పూరితో స్నేహం పెరిగింది. వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తరవాత చార్మి నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది. పూరీ జగన్నాత్ చార్మి కలిసి నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Advertisement
ఇక రీసెంట్ గా వీరిద్దరూ కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో సంయుక్తంగా లైగర్ సినిమాను నిర్మించారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించారు. అనన్య పాండే విజయ్ కు జోడీగా నటించింది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదలై ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
కాగా ఈ సినిమా ఫ్లాప్ పై వివరణ ఇస్తూ చార్మి మిగతా సినిమాలపై ఇండైరెక్ట్ గా షాకింగ్ కామెంట్ లు చేసింది. అనేక అడ్డంకుల వల్ల 2020లో షూటింగ్ ప్రారంభించిన లైగర్ 2022 ఆగస్టులో విడుదల చేయాల్సి వచ్చిందని తెలిపింది. జనాలు థియేటర్ వచ్చి సినిమా చూడాలంటే వారిని ఆశ్చర్యపరిచే అంశాలు సినిమాలో ఉండాలని చెప్పింది. ఓటీటీ వచ్చాక సినిమాలను ఇంట్లోనే చూడాలని ఇష్టపడుతున్నారు.
థియేటర్ లో చూడాలంటే కంటెంట్ ఉండాలని పేర్కొంది. బింబిసార,కార్తికేయ సీతారామం లాంటి సినిమాలు 150 కోట్ల వరకూ వసూళు చేశాయని తెలిపింది. బాలీవుడ్ లో కూడా 100 కోట్ల వసూళ్లు రాబడుతున్నాయని పేర్కొంది. ఇక సౌత్ సినిమా పిచ్చిలేదని చెప్పడం లేదు కానీ కాస్త డిప్రెసింగ్ నే ఉందని కార్తికేయ సినిమా పై ఇండైరెక్ట్ గా ఈర్శ్య చూపించింది.