గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్, యాంక్ మహాలక్ష్మిల పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికీ గతంలోనే వేరే వాళ్లతో వివాహాలు జరిగాయి. ఇక ఇప్పుడు ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహమే. అయితే రెండో వివాహం అయినా ఇండస్ట్రీలో పెద్ద విషయమేమీ కాదు. అసలు విషయం ఏంటంటే నిర్మాత చంద్రశేఖర్ బరువు ఎక్కువగా ఉండటం.
ఇవి కూడా చదవండి : “ఒకే ఒక జీవితం” సినిమా రివ్యూ…! మొత్తానికి శర్వా హిట్ కొట్టాడా…?
Advertisement
యాంకర్ నటి మహాలక్ష్మి అందంగా ఉండటమే ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడానికి కారణం అయ్యాయి. వాళ్లిద్దరూ మనసులు చూసి ప్రేమించుకుని ఉండొచ్చు. లేదంటే చంద్రశేఖర్ అంటే మహాలక్ష్మికి ఇష్టం ఉండొచ్చు. కానీ పచ్చ కామెర్లు అయిన వాళ్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు మహాలక్ష్మి డబ్బు కోసమే చంద్రశేఖర్ ను వివాహం చేసుకుంది అంటూ ట్రోల్స్ చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి : యాంకర్ రష్మీ గురించి మెగా అల్లుడు షాకింగ్ కామెంట్స్.. ఎందుకో తెలుసా..?
డబ్బు కోసం ఏదైనా చేస్తారు అంటూ నిందలు కూడా వేశారు. ఇక చంద్రశేఖర్ మహాలక్ష్మి జంట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మహాలక్ష్మి తనను డబ్బు చూసి ప్రేమించిందని ట్రోల్స్ చేస్తున్నారు.
కానీ ఆమె మనసు తనకు తెలుసన్నాడు. డబ్బు కోసం ప్రేమించే వ్యక్తి కాదన్నారు. దామిద్దరి మనసులు కలిశాయని చెప్పారు. ఇక మహాలక్ష్మికి ఇప్పటికే ఒక పాప ఉంది. అయితే తనకు మహాలక్ష్మి ఓ కండిషన్ కూడా పెట్టిందని చంద్రశేఖర్ తెలిపాడు. తమ ప్రేమకు గుర్తుగా తన తో పిల్లలు కావాలని కోరిందని చెప్పాడు. అలా చంద్రశేఖర్ తన భార్య మహాలక్ష్మి తనను ఎంతగా ఇష్టపడుతుందో చెప్పాడు.
ఇవి కూడా చదవండి : పెరుగుతో ఇన్ని ప్రయోజనాలా..? అవి తెలిస్తే ఇక మీరు వదలరు..!