Home » బన్నీ కారణంగా సినిమాల నుంచే తప్పుకున్న చంద్రమోహన్…!

బన్నీ కారణంగా సినిమాల నుంచే తప్పుకున్న చంద్రమోహన్…!

by Bunty
Ad

 

చంద్రమోహన్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా, నటుడిగా కొన్ని వందలకు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. చంద్రమోహన్ హీరోగా దాదాపు 150 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తండ్రి, అన్న వంటి పాత్రలలో నటించారు. ఇక ఈ మధ్యకాలంలో వయసు మీద పడడంతో తనకు ఆరోగ్యం సహకరించక సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తాను నటించలేదు.

chandramohan

వచ్చిన సినిమా అవకాశాలను కూడా అనారోగ్య కారణాలతో వదులుకున్నాడు. తన ఆరోగ్యం సహకరిస్తేనే సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించేవారు. అలా ఓసారి అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో చంద్రమోహన్ నటించాడు. ఆ సినిమా సమయంలో తనకు కాస్త అనారోగ్య సమస్యలు ఉండడంతో షూటింగ్ కి సరిగ్గా వెళ్లలేదు. తన వల్ల షూటింగ్ వాయిదా పడింది. దీంతో చంద్రమోహన్ చాలా బాధపడ్డారట.

Advertisement

Advertisement

నావల్ల తోటి ఆర్టిస్టులు, హీరోహీరోయిన్లు ఇబ్బంది పడ్డారని, వారి కాల్ షీట్స్ వృధా అయ్యాయని భావించిన చంద్రమోహన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇక చంద్రమోహన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ కొంగురయ్యారు. కానీ తన అనారోగ్య కారణాలు తెలుసుకున్న అందరూ ఏమీ అనలేకపోయారు. తన ఆరోగ్యం బాగుండాలని అనుకున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading