ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం తీరుపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్సిటీ, వైఎస్సార్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని చూస్తుంటే జగన్ ప్రభుత్వ దివాళా తనానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి పనులతో సీఎం జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ నిర్మించిన యూనివర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే మార్పు రాదని.. కొత్తగా నిర్మించి వాటికి మీకు నచ్చిన పేర్లు పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య విద్య కోసం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తీవ్రంగా కృషి చేశారు. ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే సంకల్పంతో 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.
Advertisement
అలాంటి చరిత్ర కలిగిన వర్సిటి పేరు మార్చడం నిజంగా హేయమైన చర్య అని, అసలు ఏ హక్కుతో యూనివర్సిటీ పేరు మార్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు సంబంధం ఏంటి..? దశాబ్దాల నాటి నుంచి ఉన్న వాటి పేర్లు మార్చడం ఏంటి..? ప్రజలు వీటిని గమనిస్తున్నారు. మీకు పేరు రాదు సరికదా మీ దిగజారుడుతనాన్ని ఛీ కొడుతారు అని మండిపడ్డారు చంద్రబాబు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదించింది. సెప్టెంబర్ 21న శాసనసభలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టి బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ పై చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవం అని, తాను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదని సీఎం జగన్ వెల్లడించారు.
Advertisement
— Jr NTR (@tarak9999) September 22, 2022
మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరిపేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అని ట్వీట్ చేశాడు.
Also Read : ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్‌మెంట్ బ్రేక్.. ఆ కారణం వల్లేనా..?
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి 25 ఏళ్లకు పైగా ఉన్న పేరును మార్చడం తనకు చాలా బాధ కలిగించిందని కళ్యాణ్ రామ్ తెలిపారు. కేవలం రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని పేర్కొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్యకు ఎన్టీఆర్ చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెట్టారని చెప్పాడు. ఓవైపు ఎన్టీఆర్ అంటే గౌరవం అంటూనే మరోవైపు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది.
Also Read : అక్టోబర్ నెలలో ఈ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది జాగ్రత్త..!