సవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం థియేటర్ల వద్ద పోలీసు భలగాలను మోహరించడంతో పాటూ ఆంక్షలను ఉల్లగించే థియేటర్ల పై ఉక్కు పాదం మోపేందుకు రెవెన్యూ సిబ్బంధిని సైతం కాపలాకు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రవిమర్శలు వస్తుండగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు.
Advertisement
సోషల్ మీడియాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు. చంద్రబాబు తన పోస్ట్ లో….. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం వైఎస్ జగన్ వదలడం లేదంటూ చంద్రబాబు పేర్కొన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లానాయక్ సినిమా పై ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం అంటూ వ్యాఖ్యానించారు.
ALSO READ : BHEEMLA NAYAK REVIEW : భీమ్లా నాయక్ ట్విట్టర్ రివ్యూ….బొమ్మ హిట్టా ఫట్టా…!
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే…ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుందన్నారు. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నా అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.