చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. చాణక్య భార్యాభర్తల మధ్య సమస్యలు స్నేహితుల మధ్య సమస్యలు ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక విషయాల గురించి చెప్పారు. ఇలాంటి వాళ్లు జీవితాంతం దుఃఖంలోనే ఉంటారని చాణక్య అన్నారు. మరి ఎటువంటి వాళ్ళు ఎప్పుడు దుఃఖంలో ఉంటారు అనే విషయాన్ని చూద్దాం. చాణక్య చెప్పిన దాని ప్రకారం పనికిరాని కొడుకు లేదా కూతురు ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా విచారంగా బాధగా ఉంటారట. సమాజంలో ఎప్పుడూ తలవంచుకుని నడవాల్సి వస్తుందట.
Advertisement
అంతేకాకుండా జీవితాంతం తమ పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు తల్లిదండ్రులు కూడా వారి జీవితం జీవితాంతం పిల్లల దుష్ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉంటారు. అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అప్పులు ఉన్నవాళ్లు ఎప్పుడు అశాంతితో ఉంటారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు సంతోషంగానే ఉండలేరు. అప్పులు తీర్చడానికి జీవితాంతం గడుపుతూ ఉంటారు అప్పుల్లో కూరుకు పోతూ ఉంటారు.
Advertisement
Also read:
అలానే చాణక్య నీతి ప్రకారం స్త్రీల ప్రవర్తన సరిగా లేని ఇళ్లల్లోని వ్యక్తులు ఎప్పుడు విచారంగా అశాంతిగా ఉంటారట. చాణక్య నీతి ప్రకారం అబద్దాలు చెప్పే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. క్రమం తప్పకుండా అబద్ధం చెప్పే స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా కూడా దీన్ని ఉపయోగిస్తుంది. అలాంటి మహిళలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ధైర్యం చేస్తారని చాణక్య అన్నారు. నమ్మకద్రోహం చేసే వ్యక్తి స్త్రీని కూడా ఎప్పుడూ నమ్మకూడదు ఆమె తన భర్తకు కూడా నమ్మకద్రోహం చేయొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!