అప్పటివరకూ సాధారణ జీవితం గడిపిన కొంతమందికి ఊహించనంతగా డబ్బులు వస్తాయి. అయితే అప్పటివరకు మామూలు జీవితం గడపగా ఒక్కసారి డబ్బులు రావడంతో వాళ్ల స్థాయి పెరిగిపోతుంది. అలా డబ్బు రావడంతో వ్యక్తిలో డబ్బుతో వచ్చిన పొగరు, అహంకారం కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. దాంతో అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది.
అనవసరమైన ఖర్చులకు, గొప్పలకు పోయే అవకాశం ఉంది. అయితే అలా డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే వచ్చిన డబ్బంతా ఎలా వచ్చిందో అలాగే పోతుందని చాణక్యనీతి చెబుతోంది. కాబట్టి అకస్మాత్తుగా డబ్బులు వచ్చినప్పుడు నాలుగు సూత్రాలు పాటిస్తే సమాజంలో గౌరవంతో పాటు సంపద పెరుగుతుందని చాణక్యుడు తెలిపాడు ఇప్పుడు. ఆ సూత్రాలు ఏంటో చూద్దాం.
Advertisement
డబ్బులు వచ్చిన వెంటనే గొప్పలకు పోకూడదు. తమ స్థితిగతులను ఇతరులకు తెలిసేలా చేస్తూ వారిని కించపరిచే ప్రయత్నం చేయకూడదు. అదేవిధంగా మనిషి తన సంపద గురించి ఇతరుల దగ్గర చెప్పవద్దు అని చాణక్య నీటి చెబుతోంది.
Advertisement
వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలని చాణక్యనీతి చెబుతోంది. సంపదను అలాగే జమ చేసుకుంటూ వెళితే ఏదో ఒకరోజు ఖర్చయిపోతుందని… కాబట్టి దానిని పెట్టుబడిగా పెడితే సంపద పెరుగుతుందని చాణక్య నీతి చెబుతోంది.
మీ దగ్గరున్న డబ్బులో కొంత భాగాన్ని ఇతరుల అవసరాలు తీర్చడానికి ఖర్చు చేయాలని చాణక్యనీతి చెబుతోంది. దాంతో అందరి దగ్గర ప్రశంసలు పొందుతారని అప్పుడే ఇంట్లో ఆనందం వర్ధిల్లుతుందని చెబుతోంది. అదే విధంగా సమాజంలో కూడా పలుకుబడి ప్రతిష్టలు పెరుగుతాయని చెబుతోంది.
డబ్బు ఖర్చుల విషయంలో చివరిది అయినా ఇదే ముఖ్యమైన సూత్రం. డబ్బు రావడంతో జీవితంలో అహంకారం పెరగకూడదు. అహంకారం ఉన్న వ్యక్తికి తప్పొప్పుల మధ్య తేడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి తనను తాను నాశనం చేసుకునే అవకాశం కూడా ఉంది. డబ్బు ఉన్నా లేకున్నా మనిషి ప్రవర్తన ఒకే విధంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది.