ప్రతి ఒక్కరు తమ జీవితం అందంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే.. ప్రతి విషయంలో ప్లానింగ్ లేకపోవడం, ప్రవర్తనల కారణంగా కూడా తెలియకుండా నష్టపోతుంటారు. అయితే.. సరైన తెలివిని అవసరమైన సమయంలో ప్రదర్శించగలిగితే జీవితంలో ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవచ్చని చాణక్య నీతి చెబుతోంది. చాణక్యుడు తన అపారమైన తెలివితేటలతో రాజనీతిజ్ఞాన్ని బోధించాడు. అలాగే.. ఆయన రాసిన చాణక్యనీతికి లోకంలో ఎంత గుర్తింపు ఉందొ చెప్పాల్సిన పని లేదు. ఇంతకీ ఆయన బోధించిన సూత్రాలలో నాలుగింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ప్రతి మనిషికి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. డబ్బు ప్రధానంగానే పని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మాభిమానం మెండుగా ఉన్నవారు తమకు ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడ మాత్రమే ఉంటారు. అయితే డబ్బు అవసరం కొద్దీ కొన్నిసార్లు గౌరవం లేకున్నా పని చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మానసిక సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు. ఆత్మాభిమానం ఉన్నప్పుడు ఇటువంటి చోట్ల పని చేయాల్సిన అవసరం లేదు. అలాగే బతకడానికి ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలి. ఎక్కడ ఉపాధి దొరుకుతుందో అక్కడకు వెళ్ళాలి. చేతులు కట్టుకుని కూర్చుని ఉపాధి కోసం ఎదురు చూస్తే మీ వద్దకి ఉపాధి రాదు.
సమాజంలో ఆనందంగా బతకాలి అని అనుకున్నప్పుడు.. మీ స్నేహితులు, బంధువులు ఉన్న చోటే ఇల్లు కట్టుకోవాలి. ఏదైనా కష్టసమయం వచ్చినపుడు, ఆపదలు ఎదురైనప్పుడు వాళ్ళు ఆదుకుంటారు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ద్వారా మీ జీవితం బాగుంటుంది. ఒకప్పుడు చదువులు లేకపోయినా జీవితాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చిన్నది, పెద్దది అని చూడకుండా.. సాధ్యమైనంత వరకు చదువుకుని ఉండాలి. అప్పుడే మీ జీవితం సంతోషంగా గడుస్తుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!