నాని హీరోగా కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా రీసెంట్ గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ యంగ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద శిష్యరికం చేశాడు. కాగా మొదటి సినిమానే నాని హీరోగా తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాలోని చమ్మీల అంగిలేసి సాంగ్ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
సినిమా విడుదల కు ముందే ఈ పాట విడుదలై యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటనే వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్ నాని కలిసి వేసిన స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ తమ స్టైల్ లో డ్యాన్స్ లు చేస్తున్నారు.
Advertisement
తాజాగా ఓ చిన్నారి ఇదే పాటకు స్టెప్పులు వేసింది. కాగా ప్రస్తుతం ఆ చిన్నారి డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక చమ్మీల అంగిలేసీ పాటకు స్టెప్పులు వేసిన చిన్నారి పేరు కీర్తి సిరి. ప్రస్తుతం ఈ పాప చేసిన డ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండింగ్ లో ఉంది. అచ్చం కీర్తి సురేష్ మాదిరిగా చీరకట్టులో కీర్తి డ్యాన్స్ చేసింది.
తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్ లను తన మాయలో పడేసుకుంది. ఈ పాటకు స్టెప్పులు వేయకముందు కీర్తి ఫాలోవర్ ల సంఖ్య కేవలం 3 వేలు మాత్రమే కాగా ప్రస్తుతం కీర్తి ఫాలోవర్ ల సంఖ్య 70వేలకు పైగానే ఉంది. ఇక కీర్తి కేవలం ఇన్స్టా లోనే కాకుండా యూట్యూబ్ లో కిట్టమ్మ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చదవండి