Home » మెగా ఫ్యామిలీ పై సంచలన కామెంట్స్ చేసిన చైతన్య తండ్రి ప్రభాకర్..! ఏమన్నారంటే..!

మెగా ఫ్యామిలీ పై సంచలన కామెంట్స్ చేసిన చైతన్య తండ్రి ప్రభాకర్..! ఏమన్నారంటే..!

by Mounika
Ad

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జొన్నలగడ్డ చైతన్యను 2020లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ముచ్చటగా మూడు సంవత్సరాలైనా కాకుండానే భర్తతో విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి చెప్పింది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వీరి విడాకులపై ఎన్నో వార్తలు ప్రచారమవుతున్న కూడా అటు చైతన్య గాని ఇటు నిహారిక గాని ఏ విధంగా స్పందించలేదు. పెళ్లి చేసుకున్న కొంతకాలానికే ఏవో కారణాల వల్ల కూకట్ పల్లి కోర్ట్‌లో విడాకులకు అప్లై చేయడంతో.. ఈ జూలై 5న కోర్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి.

Advertisement

ఇక నిహారిక, చైతన్య తమ ఇష్టప్రకారం విడిపోతున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. మొదటిలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అస్మాత్తుగా ఎందుకు విడిపోయారనే కారణంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే నిహారిక పై ఆమె మాజీ భర్త చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల విషయం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ ..  తన సన్నిహితులు మరియు స్నేహితుల వద్ద చెప్పుకొని బాధపడ్డారట.

niharika-divorce

Advertisement

 

నేను చాలా గౌరవంగా బ్రతికాను. మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. ఆ ఫ్యామిలీ అంటే చాలా గౌరవ, మర్యాదలు కలిగిన కుటుంబం అని నేను అనుకున్నాను. కానీ, వాళ్ల కూతురు నిహారికకి అలాంటి గౌరవ మర్యాదలు వారు నేర్పలేదు. ఇంటికి ఎవరన్నా అతిధులు వస్తే పలకరించేది కాదు. ఇదే కాకుండా పెళ్లయిన అమ్మాయి లేట్ నైట్ పబ్బులకు, పార్టీలకు వెళ్లకూడదని చెబితే.. నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడేది.

niharika

భార్యాభర్తలిద్దరిని వేరుగా ఉండి బతకమని చెప్పినా కూడా తన సంసారాన్ని తాను నిలబెట్టుకోలేకపోయింది. ఆమె ఇంత చేసినా కూడా నా కొడుకు గురించి మెగా అభిమానులు దారుణంగా మాట్లాడుతూ మా గౌరవం దెబ్బతీస్తున్నారు . కానీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించపోవడం నేను భరించలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారట. ప్రస్తుతం నిహారికపై, మెగా ఫ్యామిలీ పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

బాహుబలి ఇంటర్వెల్ రాజమౌళి మొదటగా అనుకున్నట్లు తీసుంటే.. సినిమా మరోలా ఉండేదేమో..

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

Samantha : “ఇంకా మూడు రోజులే..” అంటూ వైరల్ అవుతున్న సమంత పోస్ట్.. ఈ పోస్ట్ పై అర్ధం ఏంటి?

 

Visitors Are Also Reading