Home » చైనాలో పిల్లలను కనాలనుకునేవారికి రూ.25 లక్షల బ్యాంక్ లోన్…ఎందుకంటే..?

చైనాలో పిల్లలను కనాలనుకునేవారికి రూ.25 లక్షల బ్యాంక్ లోన్…ఎందుకంటే..?

by AJAY
Ad

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడంతో చైనా జనాభా నియంత్రణ కోసం కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కఠినమైన నిబంధనలతో 40 కోట్ల జనాభాని చైనా నివారించగలిగింది. దానివల్ల దేశంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం చైనా పిల్లలను కణాలని చెబుతోంది. చైనాలో జనాభా పెరుగుదల రేటు తీవ్రంగా పడిపోయింది. దాంతో ఫ్యూచర్ లో దేశంలో యువత శాతం భారీగా పడిపోయే అవకాశం ఉందని భావించింది.

Advertisement

Advertisement

దేశంలో యువ శక్తి తగ్గితే అభివృద్ధి ఉండదని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పిల్లలను కనాలని చైనా ఆదేశాలు జారీ చేసింది. చైనా వన్ చైల్డ్ పాలసీ సైతం రద్దు చేసింది. ఇద్దరు పిల్లలను లేదా ముగ్గురు పిల్లలను కనవచ్చు అంటూ కొత్త సవరణలు చేసింది. అంతేకాకుండా పిల్లలను కనాలనుకుంటున్నవారికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తోంది. జిలిన్ ప్రావిన్స్ లో ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని అనుకునేవారికి రెండు లక్షల యువాన్ లు అంటే అక్షరాల 25 లక్షల రూపాయలు అందిస్తోంది.

రుణాలను అందించేందుకు బ్యాంకులు సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పెళ్లిళ్లు చేసుకునే వారికి పిల్లల్ని కనేవారికి ఇచ్చే రుణాలపై కట్టే వడ్డీ లో భారీ డిస్కౌంట్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అప్పటికే పిల్లలు ఉన్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టు అయితే పన్ను మినహాయింపు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading