Home » ఇక నుంచి ఢిల్లీలోని రాజ్‌ప‌థ్ పేరు ఏంటో తెలుసా..?

ఇక నుంచి ఢిల్లీలోని రాజ్‌ప‌థ్ పేరు ఏంటో తెలుసా..?

by Anji
Ad

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాజ్‌ప‌థ్ గురించి అంద‌రికే తెలిసే ఉంటుంది. ఆ రాజ్‌ప‌థ్ పేరు మార్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాజ్‌ప‌థ్‌, సెంట్ర‌ల్ విస్టా లాన్ పేరును క‌ర్త‌వ్య‌ప‌థ్ గా అధికారికంగాపెట్టారు. గ‌తంలో దీనిని కింగ్స్ వే అని పిలిచారు. ఇది భార‌త్‌లోని న్యూ ఢిల్లీలో ఒక ఉత్స‌వ బౌలేవార్డ్‌, రైసినా హిల్‌లోని రాష్ట్రప‌తి భ‌వన్ నుంచి విజ‌య్ చౌక్‌, ఇండియా గేట్ మీదుగా నేష‌న‌ల్ వార్ మెమోరియ‌ల్, ఢిల్లీ, నేష‌న‌ల్ స్టేడియం వ‌ర‌కు న‌డుస్తుంది.

Advertisement

అవెన్యూ రెండు వైపులా భారీ ప‌చ్చిక బ‌య‌ళ్లు, కాలువ‌లు, చెట్ల వ‌రుస‌ల‌తో క‌ప్ప‌బ‌డి ఉంది. దేశంలోనే అత్యంత ముఖ్య‌మైన ర‌హ‌దారుల్లో ఒక‌టిగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. జ‌న‌వ‌రి 26న వార్షిక గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజు ప‌రేడ్ జ‌రుగుతుంది. జ‌న‌ప‌థ్ అన‌గా ప్ర‌జ‌ల మార్గం అని అర్థం. రాజ్‌ప‌థ్ తూర్పు-ప‌డ‌మ‌ర దిశ‌లో న‌డుస్తుంది. ఢిల్లీ ఆర్థిక కేంద్రం అయిన‌టువంటి క‌న్నాట్ ప్లేస్ నుంచి రోడ్లు ఉత్త‌రం నుంచి రాజ్‌ప‌థ్‌లోకి వెళ్తాయి.ప్ర‌స్తుతం అద్భుతంగా తీర్చిదిద్దిన సెంట్ర‌ల్ విస్టా అవెన్యూ అన్నీ సౌక‌ర్యాల‌తో ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మైంది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈనెల 8న సెంట్ర‌ల్ విస్టా అవెన్యూని ప్రారంభించనున్నారు ప్ర‌ధాని మోడీ . రీ డెవ‌ల‌ప్ చేసిన ప్రాంతం ఇప్పుడు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ఐస్‌క్రీమ్ బండ్లు, వీధి వ్యాపారుల కోసం కొత్త వెండింగ్ జోన్ల‌ను ఏర్పాటు చేశారు. సెంట్ర‌ల్ విస్టా అవెన్యూ సుమారు రెండు కిలోమీట‌ర్ల పొడ‌వు ఉంటుంది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు సెంట్ర‌ల్ విస్టాను శోభాయమానంగా తీర్చిదిద్దారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి : Pushpa 2: మైండ్ బ్లోయింగ్ పాత్రలో సాయిపల్లవి.. వారి మధ్య లవ్ ఏ రేంజ్ లో అంటే..?

అయితే దీని చ‌రిత్ర గురించి మ‌నం చూసిన‌ట్ట‌యితే 1911లో కోల్‌క‌తా నుంచి ఢిల్లీకి రాజ‌ధానిని మార్చింది బ్రిటీష్ వైశ్రాయ్ పాల‌న‌. ఆ స‌మ‌యంలో నిర్వ‌హించిన ద‌ర్భార్ కోసం వ‌చ్చిన అప్ప‌టి బ్రిటిష్ చ‌క్ర‌వ‌ర్తి జార్జ్ 5 వ‌చ్చారు. ఆ స‌మ‌యంలోనే రాజ్‌ప‌థ్ వాడుక‌లోకి వ‌చ్చింది. 75 ఏళ్ళ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా బ్రిటిష‌ర్లు, వ‌ల‌స పాల‌న‌లో పేర్ల‌కు, గుర్తుల‌కు స్వ‌స్తీ చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పంద్రాగ‌స్టు ప్ర‌సంగంలో ప్ర‌ధాని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇండియా గేట్ నుంచి మ‌న్‌సింగ్ రోడ్డు వ‌ర‌కు ఉన్న లాన్స్ పిక్నిక్స్‌, ఫుడ్స్‌ని అనుమ‌తించ‌డం లేదు. లాన్స్ వ‌ద్ద ఉన్న చిన్న చిన్న కెనాల్స్‌పై ఫ‌ర్మినెంట్ బ్రిడ్జ్‌ల‌ను క‌ట్టారు. ర‌ద్దీగా ఉండే జంక్ష‌న్ల‌లో పాదచారుల కోసం నాలుగు అండ‌ర్ పాస్‌ల‌ను నిర్మించారు. సంద‌ర్శ‌కుల ర‌క్ష‌ణ కోసం 900 కంటే ఎక్కువ లైట్ పోల్స్‌ను ఏర్పాటు చేశారు. బైకులు, కార్లు, క్యాబ్స్‌, బ‌స్సుల ఆటోల పార్కింగ్ కోసం వేర్వేరుగా పార్కింగ్ బేలు ఏర్పాటు చేశారు. రిప‌బ్లిక్ ప‌రేడ్ కోసం స్పెష‌ల్ ఆరేంజ్‌మెంట్స్ ఉన్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  సినీ అభిమానుల‌కు ఐబొమ్మ బిగ్ షాక్‌.. ఇక అప్ప‌టి నుంచి శాశ్వ‌తంగా సేవ‌లు బంద్‌..!

Visitors Are Also Reading