సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెలబ్రిటీలనే సాధారణ ప్రజలు రోల్ మోడల్ గా తీసుకుంటారు. సెలెబ్రెటీలు ఏం చేస్తే తాము కూడా అదే చేయాలని అనుకుంటారు. కానీ తాజాగా బుల్లితెర సెలబ్రిటీ ఒకరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అడ్డంగా దొరికిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో గాని 60 లక్షల విలువచేసే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Advertisement
Advertisement
ఇక ఆ బుల్లితెర సెలబ్రిటీ పేరు హరిబాబు. ఈ పేరు జబర్దస్త్ ప్రేక్షకులకు బాగా పరిచయం. హరిబాబు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేయడంతో పాటు కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అతనిపై స్మగ్లింగ్ కేసు బుక్ అయ్యింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే… ఆదివారం రాత్రి 11 గంటలకు పుంగనూరు పోలీసులకు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా రెండు వాహనాల డ్రైవర్లు పారిపోయారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. కాగా ఆ వాహనాల్లో ఎర్రచందనం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా అందులో డ్రైవర్ హరిబాబు పేరు బయటకు వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాలో హరిబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తనపై చాలా కేసులు ఉన్నాయని కూడా పోలీసులు చెబుతున్నారు. 2021 లో చిత్తూరు జిల్లాలోని బాకరాపేట దగ్గర ఎర్రచందనం రవాణా కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా హరిబాబు తప్పించుకున్నాడని చెబుతున్నారు. అయితే ఈ కేసు పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. హరిబాబు అంటే జబర్దస్త్ హరిబాబు ఏనా… ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.