దాదాపు ఏడు సంవత్సరాల పాటు సహజీవనం చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఏ ముహూర్తాన పెళ్లి చేసుకున్నారో గాని పెళ్ళైనప్పటి నుండి ఈ జంట ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. వివాహం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరుమల మాడవీధుల్లో నయనతార చెప్పులతో సంచరించారు. ఇక నయన్ చేసిన పనికి హిందూ వర్గాలు మండిపడడంతో టీటీడీ చర్యలు తీసుకోవడం సిద్ధమయ్యింది.. ఇక చేసేదేమీ లేక క్షమాపణలు చెప్పి ఈ జంట బయటపడ్డారు.
Advertisement
ఒక సమస్య తీరింది అనే లోపు పెళ్ళైన నెలల వ్యవధిలో కవలలకు తల్లిదండ్రులం అయ్యామంటూ ప్రకటించి మరో వివాదంలో చిక్కుకున్నారు. నయనతార మరియు విగ్నేష్ చేసిన ఆ పనికి తమిళనాడు ప్రభుత్వం సరోగసీ నిబంధనలు ఉల్లఘించారని విచారణకు ఆదేశించింది. తమకు ఐదేళ్ల క్రితమే పెళ్లయింది అంటూ, సరోగసీ చట్టానికి సంబంధించిన అన్ని నియమాలు పాటించామంటూ ఆధారాలు చూపించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.
Advertisement
ప్రస్తుతం నయనతార దంపతులు మరో వివాదంలో చిక్కుకొని మరల హాట్ టాపిక్ గా మారారు. విగ్నేష్ శివన్ పై ఆయన బాబాయిలు ఆస్తి కాజేశారంటూ కేసు నమోదు చేశారు. విఘ్నేశ్ శివన్ తండ్రి పేరు శివకొళుదు. ఆయన పూర్వీకుల నుంచి తిరుచ్చి జిల్లా, లాల్కడి గ్రామం ఉండేవారు. శివకొళుదు మొత్తం తొమ్మిది మంది అన్నదమ్ములు. శివకొళుదు పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేసేవారు.
ఆయన కొన్నాళ్ల క్రితం మరణించడంతో, శివకొళుదు జీవించి ఉన్న సమయంలో ఉమ్మడి ఆస్తి మాకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం, కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో విగ్నేష్ పై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆయన భార్య నయనతారలతో పాటు విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల మీద కూడా చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక డీజీపీ ఫిర్యాదును ఆధారంగా తీసుకొని విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఎట్టకేలకు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల రహస్యాన్ని బయటపెట్టిన మధుబాల.. కారణం ఆ హీరోనే..?
ఎన్టీఆర్ జ్ఞాపకశక్తిపై.. రాజమౌళి కామెంట్స్.. వైరల్..!
పవన్ కళ్యాణ్ తరువాత మళ్లీ ఆ ఛాన్స్ రామ్ చరణకేనా..?