Home » ఆ దేశంలో ఒంటెలకు అందాల పోటీలు.. అందుకోస‌మేనా..?

ఆ దేశంలో ఒంటెలకు అందాల పోటీలు.. అందుకోస‌మేనా..?

by Bunty
Ad

ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో ఒకప్పుడు ఒంటెలు మాత్రమే వాహనంగా ఉపయోగించేవారు. అక్కడి వారికి ఇప్పటికీ ఒంటెలు అంటే ఎంతో మక్కువ. దీంతో వారు ప్రతీ ఏడాది ఒంటెలకు అందాల పోటీలు నిర్వహిస్తారు. సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంలో ప్రసిద్ధ కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ప్రతీ సంవత్సరం నెల రోజుల పాటు కొన‌సాగిస్తారు. ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు కోట్లల్లో భారీ ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. అంత ఇంతా కాదు ఏకంగా రూ. 500 కోట్లు ప్రైజ్‌ మనీ ఇచ్చి ఘనంగా సత్కరిస్తారు.

Advertisement

ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. కానీ ఒంటెలను అందాల పోటీ పేరుతో వాటి యజమానులు ఆ మూగ జీవాలను అత్యంత దారుణంగా హింసలకు గురిచేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రైజ్ మనీ గెలవడానికి ఆ ఒంటెల యజమానుల వాటికి ఆకర్షణీయంగా తయారుచేయడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు ఇచ్చి ఫేస్ చర్మం లిఫ్ట్ చేస్తున్నారు. కొందరైతే వాటికి ఫేస్ సర్జరీ కూడా చేయించారని సమాచారం.

Advertisement

కానీ ఇటువంటివి వాడకూడదనే నియమం ఉంది. అయినా ఈ షరతులను ఒంటెల యజమానులు ఖాతరు చేయడం లేదు. దీంతో పోటీ నిర్వహకులు ఒంటెల్ని పరీక్షిస్తున్నారు. వాటికి ఇంజెక్షన్లు చేశారా? సర్జరీ చేశారా? అని పరిశీలిస్తారు. ఈ సారి అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్‌లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లుగా ఈ తనిఖీల్లో తేలింది. దీంతో సదరు ఒంటెల యజమానులపై అనర్హత వేటు విధించారు. అంతేకాదు…ఆ ఒంటెల పెంపకందారులకు కఠిన జరిమాన కూడా విధించారు. ఫిల్లర్లు, బొటాక్స్ లేదా హార్మోన్లను ఇంజెక్ట్ చేసినందుకు ఒంటెకు 100,000 రియాల్స్ వరకు జరిమానా కూడా విధించార‌ని స‌మాచారం.

 

 

Visitors Are Also Reading