సాధారణంగా రాష్ట్రం, దేశంలో ఎక్కడైనా ఏదో ఒక చోట ఏదో ఒక విషయంలో అవినీతి జరుగుతూనే ఉంటుంది. అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కూడా లంచం లేనిది ఏ పని చేయడం లేదు. అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ సరికొత్త ప్రణాళిక తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి తెలంగాణ ఏసీబీ ఆధ్వర్యంలో పని చేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే రూ. 5000 నుంచి రూ.10,000 వరకు ఇవ్వనున్నారు.
Advertisement
రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీఓ, విద్యుత్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, మండల కార్యాలయం, పోలీస్‌స్టేషన్, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్, 108, 104 సర్వీసులు ఇలా ఏది అయినా సరే ఎక్కడైనా కూడా లంచం అడిగినట్టయితే.. 14400కి ఫోన్ చేసి మీ యొక్క ఆర్జి లేఖ ఆ అధికారి పేరుతో ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు.
Advertisement
Also Read : 1959 లో బంగారం ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ, EWS ఇలా అనేక సర్వీసులు సంబంధించిన నెంబర్స్ తో ఫిర్యాదులు చేయాలని కోరారు. ఎవరైనా చేయాల్సింది ఒక్కటేనని అదే ఆర్జి నెంబర్, లేఖ సంబంధించిన కార్యాలయంలోని సిబ్బంది వివరాలతో ఫోన్ చేయండి. గిఫ్ట్ పట్టండి. తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి, బటన్ ప్రెస్‌చేసి వీడియో ద్వారా కాని, ఆడియో ద్వారా కానీ సంభాషణను రికార్డు చేయాలని అవినీతి నిరోధక శాఖ సూచించింది. ఇక ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని.. దీంతో వారిపై చర్యలు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది.
Also Read : బ్రహ్మ ముహూర్తంలో దాగి ఉన్న రహస్యాలు ఇవే..!