Home » Mahesh Babu: “బిజినెస్ మాన్” సినిమా లాభాలన్నీ మహేష్ బాబుకే ఇచ్చేశారట.. ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు!

Mahesh Babu: “బిజినెస్ మాన్” సినిమా లాభాలన్నీ మహేష్ బాబుకే ఇచ్చేశారట.. ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఈ మధ్య సినిమాల రీరిలీజ్ ట్రెండ్ ఊపు అందుకున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ.. ప్రస్తుతం థియేటర్లలో రి రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా థియేటర్ కు వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో నిర్మాతలకు రూపాయి ఖర్చు లేకున్నా.. రీరిలీజ్ లతో దండిగానే ఆదాయం లభిస్తోంది. ఇటీవల ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా “బిజినెస్ మాన్” సినిమాను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా రిరీలీజ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. 2012 లో రిలీజ్ అయ్యి దుమ్ము దులిపిన ఈ సినిమా తాజాగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్క నైజాం లోనే ఏకంగా రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.42 కోట్లు.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 5.31 కోట్ల కలెక్షన్స్ ను ఈ సినిమా రాబట్టింది. అయితే. బిజినెస్ మాన్ సినిమా రిరీలీజ్ లాభాలను మహేష్ బాబు కె ఇచ్చేస్తున్నారట.

Advertisement

అంటే.. ఆయన స్వంతంగా వాడుకోవడానికి కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ” `మహేష్‌ బాబు ఫౌండేషన్‍` పేరుతో చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. వీటి కోసం బిజినెస్ మాన్ సినిమా రిరీలీజ్ లాభాలను విరాళంగా ఇచ్చేశారట. పిల్లలకు చదువు చెప్పించడానికి, స్కాలర్ షిప్ ఇవ్వడానికి, పిల్లల గుండె ఆపరేషన్లు చేయడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు “బిజినెస్ మాన్” సినిమా నిర్మాతలను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మరిన్ని..

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

Visitors Are Also Reading