Home » “ఆర్య” మూవీ కథను సుకుమార్ ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా… అతను చేసి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు..!

“ఆర్య” మూవీ కథను సుకుమార్ ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా… అతను చేసి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన నితిన్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన దిల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ సమయంలో సుకుమార్ పనితనం నచ్చిన దిల్ రాజు తనకు మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు.

Advertisement

సుకుమార్ దిల్ రాజు ఇచ్చిన అవకాశంతో అల్లు అర్జున్ హీరోగా ఆర్య మూవీని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి… ఆ సమయంలో 30 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఆర్య మూవీ కథను సుకుమార్ మొదటగా అల్లు అర్జున్ కోసం రాసుకోలేదట… మరో యంగ్ హీరో కోసం రాసుకున్నాడట. కాకపోతే ఆ పరిస్థితుల్లో సుకుమార్ ఆ హీరోతో కాకుండా అల్లు అర్జున్ తో ఈ మూవీ చేయవలసి వచ్చిందట.

Advertisement

మరి సుకుమార్ ఆర్య కథను ఏ హీరో కోసం రాసుకున్నాడు… ఎలాంటి పరిస్థితుల్లో బన్నీ తో ఈ మూవీని తెరకెక్కించవలసి వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. సుకుమార్ మొదటగా ఆర్య కథను అల్లరి నరేష్ కోసం రాసుకున్నాడట. కాకపోతే దిల్ రాజు ఈ మూవీని బన్నీతో సెట్ చేయడంతో సుకుమార్… బన్నీతోనే ఆర్య మూవీని రూపొందించాడట.

అయితే ఆ తర్వాత 100% మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి నరేష్ ను సుకుమార్ కలిశాడట. ఆ సమయంలో సుకుమార్ అసలు ఆర్య మూవీ కథను నీకోసమే రాసుకున్నాను అని చెప్పాడట. ఇదే విషయాన్ని అల్లరి నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఒకవేళ ఆర్య మూవీ కనుక నరేష్ చేసి ఉంటే ప్రస్తుతం నరేష్ కూడా స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించేవాడు కావచ్చు.

Visitors Are Also Reading