తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన నితిన్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన దిల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ సమయంలో సుకుమార్ పనితనం నచ్చిన దిల్ రాజు తనకు మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు.
Advertisement
సుకుమార్ దిల్ రాజు ఇచ్చిన అవకాశంతో అల్లు అర్జున్ హీరోగా ఆర్య మూవీని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి… ఆ సమయంలో 30 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఆర్య మూవీ కథను సుకుమార్ మొదటగా అల్లు అర్జున్ కోసం రాసుకోలేదట… మరో యంగ్ హీరో కోసం రాసుకున్నాడట. కాకపోతే ఆ పరిస్థితుల్లో సుకుమార్ ఆ హీరోతో కాకుండా అల్లు అర్జున్ తో ఈ మూవీ చేయవలసి వచ్చిందట.
Advertisement
మరి సుకుమార్ ఆర్య కథను ఏ హీరో కోసం రాసుకున్నాడు… ఎలాంటి పరిస్థితుల్లో బన్నీ తో ఈ మూవీని తెరకెక్కించవలసి వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. సుకుమార్ మొదటగా ఆర్య కథను అల్లరి నరేష్ కోసం రాసుకున్నాడట. కాకపోతే దిల్ రాజు ఈ మూవీని బన్నీతో సెట్ చేయడంతో సుకుమార్… బన్నీతోనే ఆర్య మూవీని రూపొందించాడట.
అయితే ఆ తర్వాత 100% మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి నరేష్ ను సుకుమార్ కలిశాడట. ఆ సమయంలో సుకుమార్ అసలు ఆర్య మూవీ కథను నీకోసమే రాసుకున్నాను అని చెప్పాడట. ఇదే విషయాన్ని అల్లరి నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఒకవేళ ఆర్య మూవీ కనుక నరేష్ చేసి ఉంటే ప్రస్తుతం నరేష్ కూడా స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించేవాడు కావచ్చు.