Home » బాల‌య్య బొబ్బిలి సింహం కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను ఎక్క‌డ నుండి తీసుకున్నారో తెలుసా..!

బాల‌య్య బొబ్బిలి సింహం కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను ఎక్క‌డ నుండి తీసుకున్నారో తెలుసా..!

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే టాప్ రచయిత ఎవర‌ని అడిగితే ముందుగా వినిపించే పేరు విజయేంద్రప్రసాద్. బాహుబలి, బజరంగీ భాయిజాన్, మగధీర, రీసెంట్ గా వ‌చ్చి రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు విజయేంద్రప్రసాద్ కథల‌ను అందించారు. అయితే ఇప్పటి తరానికి తెలిసిన విషయం ఇంతే. కానీ 90ల‌లోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు విజయేంద్రప్రసాద్ కథల‌ను అందించారు.

Advertisement

ఆయన కలం నుండి వచ్చిన కథలు రికార్డులు క్రియేట్ చేశాయి. అలా విజయేంద్రప్రసాద్ రాసిన కథల్లో ఒకటి బాలయ్య హీరోగా నటించిన బొబ్బిలి సింహం. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా రోజా, మీనా హీరోయిన్లు గా నటించారు. 1994 సెప్టెంబరు 24 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా…. మొదటి రోజే ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది.

Advertisement

ఈ సినిమాకు కీరవాణి అందించిన స్వరాలు హైలెట్ గా నిలిచాయి. ఈ సూపర్ హిట్ సినిమా 60 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోగా 15 కేంద్రాలలో 100 రోజులు ఆడి బాలయ్య కెరీర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా కథను విజయేంద్రప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమాభిషేకం స్ఫూర్తితో తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రేమాభిషేకం సినిమా లో ఏఎన్ఆర్ కు క్యాన్సర్ ఉంటుంది.

ALSO READ : తొలిసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చిరంజీవి ఇండ‌స్ట్రీకి ఎలా ప‌రిచ‌యం చేశారో తెలుసా..?

కాగా బొబ్బిలి సింహం సినిమా లో రోజా కి క్యాన్సర్ ఉంటుంది. ఇక ప్రేమాభిషేకం సినిమాలో లవ్ ట్రాక్ కనిపించగా బొబ్బిలి సింహం సినిమా లో…. మాస్ మసాలా అంశాలు కూడా జోడించి ఉంటాయి. అంతేకాకుండా సినిమా పూర్తి కమర్షియల్ గా కనిపిస్తోంది. ఇక ప్ర‌స్తుతం ర‌చ‌యిత‌గా విజ‌యేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీగా మారిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాల‌కే కాకుండా బాలీవుడ్ సినిమాల‌కు కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ల‌ను అందిస్తున్నారు.

Visitors Are Also Reading