ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడికి చాలా భారంగా మారాయి. బండి బయటకు తీయాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇంతకుముందు సందు చివర లో షాప్ కి వెళ్ళాలి అన్న బండి తీసి వెళ్లేవారు. కానీ ప్రస్తుతం అత్యవసరం అయితే తప్ప బండి మాత్రం బయటకు తీయడం లేదు. లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలు చేరడంతో ఇక చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
Advertisement
ఈ తరుణంలో వాహనదారులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది.. అది ఏంటో తెలుసుకుందాం..!! అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సోలాపూర్ లో అంబేద్కర్ స్టూడెంట్స్ యూత్ పాంథర్స్ సమక్షంలో రూపాయికే పెట్రోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు వందల మందికి రూపాయికే పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో వాహనదారులు వచ్చి పెట్రోల్ బంక్ వద్ద క్యూ కట్టారు.
Advertisement
దీంతో రద్దీ ఎక్కువై పోలీసులు వచ్చారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి ఒక లీటర్ పెట్రోలు మాత్రమే ఇచ్చారు. భారమైనటువంటి పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సందేశం ఇవ్వడానికి ఇలా చేసినట్లు అంబేద్కర్ స్టూడెంట్స్ యూత్ పాంథర్స్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకున్న కస్టమర్లు చాలా ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!
ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొట్టిన రాధిక…అసలు ఏం జరిగిందంటే….!
కెజియఫ్ 2 సక్సెస్ కి కారణం రాజమౌళి.. ఎలా అంటే..?