ఎంపీ కేశినేని నాని అలానే టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం బాగా పెరుగుతుంది. విజయవాడ ఎంపీ సీటు విషయంలో సొంత తమ్ముడు చిన్ని తో విభేదాలు రావడం వలన నాని టీడీపీ ని వదిలి వెళ్ళిపోయారు టిడిపి అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత సీఎం జగన్ ని కలిసి విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకున్నారు నాని. ఇలా జరగడం వలన కేశినేని నాని టిడిపి నేతలు మధ్య మాట పెరుగుతుంది.
Advertisement
Advertisement
టిడిపి నేతలు వర్సెస్ నానిగా విజయవాడలో రాజకీయం మొదలైంది. చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ గా పెట్టుకుని కేశినేని నాని విమర్శలు చేశారు. కేశినేని నానికి టిడిపి నేతలు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తున్నారు. కేశినేని నాని ఊసరవెల్లి అని కామెంట్ చేశారు బుద్ధ వెంకన్న. 2009-20024 మధ్యకాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారని అన్నారు టీడీపీ, వైసిపి అని ఇలా మూడు పార్టీల్లో చేరారని 2019లో చంద్రబాబు మరొక అవకాశాన్ని ఇచ్చారు అప్పటినుండి కేశినేని నాని లో శాడిజం పెరిగిందని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!