బుచ్చిబాబు… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు సుకుమార్ శిష్యునిగా వచ్చినా కూడా ఇప్పుడు తనకంటూ ఓ పేరును గుర్తింపును ఒక్క సినిమాతోనే సంపాదించుకున్నాడు. ఉప్పెన సినిమా సూపర్ హిట్ కావడంతో బుచ్చిబాబు తర్వాతి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు బయటకు వచ్చింది. కానీ ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాలతో సినిమా చేస్తున్నాడు. అందువల్ల బుచ్చిబాబు ఇంకొన్ని రోజులు ఎన్టీఆర్ కోసం ఆగాల్సిందే.
Advertisement
ఇక ఇప్పటీ ఎన్టీఆర్ కథకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్న బుచ్చిబాబు.. దొరికిన ఈ కాలి సమయాన్ని వృథా చేయడం లేదు. ఈ సమయంలో మళ్ళీ గురువు వద్దకు వచ్చి.. ఆయన కోసం పని చేస్తున్నాడు. అయితే బుచ్చిబాబు గురువు సుకుమార్.. ఇప్పుడు పుష్ప 2 కథతో బాగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంచనాలు లేకుండానే పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన పుష్ప సినిమా అనేది సూపర్ హిట్ అందుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇందులో హీరో అయిన అల్లు అర్జున్ పేరు దేశం మొత్తం మారుమ్రోగింది.
Advertisement
అందుకే ఈ సినిమా సీక్వెల్ అయిన పుష్ప 2 కథను మొత్తం పాన్ ఇండియా అభిమానులను దృష్టిలో ఉంచుకొని రెడీ చేస్తున్నాడు. అందుకే పుష్ప వచ్చి ఇప్పటికే ఏడు నెలలు అవుతున్న ఇంకా సీక్వెల్ అనేది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ఈ సినిమా కథ విషయంలో ప్రతి ఒక్కరిని సంప్రదిస్తునాడు సుకుమార్. అందులో భాగంగానే బుచ్చిబాబు కూడా పుష్ప 2 సినిమా యొక్క కథ ప్రిపరేషన్ లో చేరాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బుచ్చిబాబు తమ హీరో కోసం పనిచేస్తుండటం బన్నీ ఫ్యాన్స్ కు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నది.
ఇవి కూడా చదవండి :