Telugu News » Blog » భర్తకు విడాకులిచ్చి కుక్కను పెళ్లి చేసుకున్న మహిళ…అదే బెటర్ అంటూ బోల్డ్ కామెంట్స్..!

భర్తకు విడాకులిచ్చి కుక్కను పెళ్లి చేసుకున్న మహిళ…అదే బెటర్ అంటూ బోల్డ్ కామెంట్స్..!

by AJAY
Ads

భార్యాభ‌ర్త‌లు అన్నాక గొడ‌వ‌లు స‌హ‌జ‌మే…అయితే కొన్నిసార్లు చిన్న చిన్న గొడ‌వ‌లు కాగా మ‌రికొన్ని సార్లు కాస్త పెద్ద గొడ‌వ‌లు అవ‌తాయి. స‌ర్దుకుపోవాలి గానీ వాటిని సీరియ‌స్ గా తీసుకుంటే మ్యాట‌ర్ విడాకుల వ‌ర‌కూ వెళుతుంది. దాంతో ఇద్ద‌రూ విడిపోవాల్సి వ‌స్తుంది. ఇక విడిపోయి సింగిల్ బ్ర‌త‌క‌డం ఆ బాధ‌లు ఎందుకా అని చాలా మంది కాంప్ర‌మైజ్ అవుతారు. కానీ బ్రిట‌న్ కు చెందిన ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌లు జ‌ర‌గ‌టం వ‌ల్ల అత‌డికి విడాకులు ఇచ్చింది. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.?? అయితే భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన త‌ర‌వాత సింగిల్ గా బ్ర‌త‌కాలి లేదంటే మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాలి కానీ ఆ మ‌హిళ త‌న పెంపుడు కుక్క‌నే వివాహం చేసుకుని వార్త‌ల్లోకి ఎక్కింది.

Advertisement

Advertisement

Women married to dog

Women married to dog

వివ‌రాల్లోకి వెళితే…..అమండా రోజెస్ అనే బ్రిటెన్ కు చెందిన మ‌హిళ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చిన త‌న త‌ర్వాత త‌న రెండు నెల‌ల పెంపుడు కుక్క‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్టు చెబుతోంది. అంతే కాకుండా భ‌ర్త తో కంటే కుక్క‌తోనే ఎంతో హ్యాపీగా ఉన్నా అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ కుక్క పేరు షెరో….ఆ కుక్క కండ్ల‌లోనే నిజ‌మైన ప్రేమ క‌నిపించిందని అమాండ చెబుతోంది. తాను మొద‌టి సారి త‌న కుక్క‌కు మోకాళ్ల‌పై నిలుచుని ప్ర‌పోజ్ చేసిన‌ట్టు తెలిపింది.

ఆ స‌మ‌యంలో త‌న పెంపుడు కుక్క షెరో తోక ఊపుతూ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రించింద‌ని చెబుతోంది. ఇద్ద‌రి మ‌న‌సులూ క‌ల‌వ‌డంతో తాము 200 మంది బంధువుల స‌మక్షంలో పెళ్లి చేసుకున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇక ప్ర‌స్తుతం అమాండ త‌న పెంపుడు కుక్కను పెళ్లి చేసుకున్న‌ట్టు తెలిపిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాంతో నెటిజ‌న్లు పిచ్చి ముదిరితే ఇలానే త‌యార‌వుతారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ‌రికొంద‌రు కొంప‌దీసి పిల్ల‌ల‌ను కంటారా ఏంటి షెరోతో అంటూ జోకులు చేస్తున్నారు.