NTR కలల ప్రాజెక్ట్ బ్రహ్మర్షి విశ్వామిత్ర.! 1989 దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేద్దామని 1988లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఏ సినిమాకు పడని కష్టం NTR ఈ సినిమాకు పడ్డారు. CM గా ఒక వైపు, నటుడిగా ఒకవైపు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
Advertisement
1988లో షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరినుండి అన్నీ కష్టాలే! రాష్ట్రం రాజకీయంగా అల్లకల్లోలంగా ఉండడం. నక్సలైట్స్ దాడులు, వరదలు, కరువు, అపోజిషన్ నుండే కాకుండా సొంత పార్టీ నేతల నుండి సైతం విమర్శలు రావడం, ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి ఇలా ఆ యేడాది అంతా NTR ప్రతికూలంగా గడిచింది.
Advertisement
అధికారులు ప్రభుత్వ ఫైల్స్ ను షూటింగ్ స్పాట్ కే తీసుకొచ్చేవారు. షూటింగ్ మధ్యలో అనేక సార్లు ఆ ఫైల్స్ చూస్తూ వాటిపై సంతకాలు చేసేవారు NTR! ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించాయి. అయినా NTR ఈ విషయంలో రాజీ పడలేదు.!
ఇక విశ్వామిత్ర పాత్ర కోసం NTR చాలా బరువు తగ్గాడు. కేవలం ఫ్రూట్స్ మాత్రమే తినడం, నేలపై పడుకోవడం లాంటివి చేశారు. ఇన్ని కష్టాలు, మాటలు పడ్డప్పటికీ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. ఫైనల్ గా 1991 ఏప్రిల్ 19న విడుదల కాబడిన ఈ సినిమా రిజల్ట్ మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది.