Home » ఓ బాబుకు “బోర్డర్” అని మరో బాబుకు “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థానీలు..కారణం ఇదే..!

ఓ బాబుకు “బోర్డర్” అని మరో బాబుకు “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థానీలు..కారణం ఇదే..!

by AJAY
Ad

పుట్టిన పిల్లలకు ఒకప్పుడు దేవుళ్ళ పేర్లు ఎక్కువగా పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు దేవుళ్ళ పేర్లు పెద్దగా పెట్టుకోవడం లేదు కానీ ఎవరికీ పలకరాకుండా డిఫరెంట్ పేర్లను పెట్టుకుంటున్నారు. ఇక పిల్లలు పుట్టిన సమయంలో పరిస్థితిలు డిఫరెంట్ గా ఉంటే వాటినే పేరుగా కూడా కొంతమంది పెట్టుకుంటారు. రీసెంట్ గా కరోనా సమయంలో చాలామంది తమ పిల్లలకు కరోనా అంటూ పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అప్పట్లో స్కైలాబ్ పడుతుంది అన్న సమయంలో లో పుట్టిన పిల్లలకు చాలామంది స్కైలాబ్ అంటూ పేరు పెట్టుకున్నారు.

Advertisement

Advertisement

ఇక తాజాగా ఓ బిడ్డ కు పెట్టిన పేరు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే… 70 రోజులుగా 90 మంది పాకిస్థానీయులు అట్టారి సరిహద్దు ప్రాంతంలో చిక్కుకు పోయిన సంగతి తెలిసిందే. అయితే వారిలో నింబు బాయ్ – బాలమ్ బాయ్ దంపతులు కూడా ఉన్నారు. కాగా నింబూ బాయ్ గర్భవతి కావడం తో ఈనెల 2న ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దాంతో సమీపం లో ఉండే పంజాబ్ ప్రజలు కొందరు వచ్చి ఆమె డెలివరీకి సాయం చేశారు. అయితే ఆమెకు పుట్టిన బాబుకు బోర్డర్ అని నామకరణం చేశారు. బోర్డర్లో పుట్టడం వల్ల ఆ బాబుకు బోర్డర్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటనపై బాబు తండ్రి బాలమ్ రామ్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

 

లాక్‌డౌన్‌ కు ముందు యాత్ర కోసం 90 మంది తో కలిసి ఇండియా కు వచ్చామని చెప్పారు. అయితే అవసరమైన పత్రాలు తమ దగ్గర లేకపోవడంతో తిరిగి స్వదేశం లోకి చేరుకోవడం కష్టంగా మారిందని అన్నారు. వారి బృందంలో 47 మంది చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. అంతే కాకుండా వారిలో ఆరుగురు ఇండియాలోనే జన్మించారు అని తెలిపారు. లగ్యా రామ్ అనే మరో వ్యక్తి కూడా తనకు పుట్టిన కుమారుడికి భారత్ అని పేరు పెట్టారు. ఆ బాబు గత సంవత్సరం జోద్పూర్ లో జన్మించాడు. తన సోదరుడిని కలిసి వెళ్దాం అని వచ్చి లాగ్య రామ్ ఇక్కడ ఇరుక్కుపోయాను అని తెలిపాడు.

Visitors Are Also Reading